AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈగలు, దోమలు పరార్..! ఇల్లు తుడిచే నీటిలో ఇవి ఉంటే చాలు, నో రోగాలు, నో టెన్షన్!!

ఇంట్లో ఈగలు, దోమల బెడద ఎక్కువగా ఉంటే కెమికల్స్ ఉన్న స్ప్రేలకు బదులుగా సహజమైన పద్ధతి ద్వారా వాటిని తరిమికొట్టవచ్చు. రోజూ ఇల్లు తుడిచే నీటిలో కొన్ని సహజ పదార్థాలను కలపడం వల్ల ఈగలు, దోమలు, క్రిమిషీటకాలు ఇట్లే మాయమవుతాయి. ఈ సహజ సిద్ధమైన పదార్థానలు నీటిలో కలిపి తుడవడం వల్ల ఇల్లు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా సువాసనభరితంగా మారుతుంది. ఈ చిన్న చిట్కాలను పాటిస్తే కెమికల్స్ వాడకుండానే క్రిమిరహిత వాతావరణాన్ని సొంతం చేసుకోవచ్చు.

ఈగలు, దోమలు పరార్..! ఇల్లు తుడిచే నీటిలో ఇవి ఉంటే చాలు, నో రోగాలు, నో టెన్షన్!!
Natural Home Remedies
Jyothi Gadda
|

Updated on: Jul 25, 2026 | 8:43 PM

Share

వర్షాకాలంలో లేదా వేసవి కాలంలో ఇళ్లలోకి ఈగలు, దోమలు, చీమలు వంటి పురుగులు రావడం చాలా సాధారణ సమస్య. వీటి వల్ల అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉంది. చాలామంది వీటి నివారణకు మార్కెట్లో దొరికే కెమికల్ ఆల్ అవుట్‌లు, స్ప్రేలు ఉపయోగిస్తారు. అయితే ఇవి ఆరోగ్యంపై, ముఖ్యంగా పిల్లలు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. దానికి బదులుగా రోజూ ఇల్లు తుడిచే నీటిలో కొన్ని కిచెన్ పదార్థాలను ఉపయోగిస్తే ఈ పురుగుల బెడద నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

నీటిలో కలపాల్సిన సహజ పదార్థాలు:

కాల్చిన కర్పూరం, పొడి: కర్పూరం వాసన ఈగలు, దోమలకు అస్సలు పడదు. ఇల్లు తుడిచే నీటిలో కర్పూరం పొడి చేసి కలపాలి. ఇది క్రిమి సంహారిణిగా పనిచేసి, ఇల్లంతా మంచి సువాసనను నింపుతుంది.

తెల్ల వెనిగర్: వెనిగర్‌లోని ఆమ్ల గుణాలు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. బకెట్ నీటిలో అర కప్పు వెనిగర్ కలిపి తుడవడం వల్ల ఫ్లోర్ మెరవడమే కాకుండా ఈగలు రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఉప్పు: రాతి ఉప్పు లేదా కల్లు ఉప్పును నీటిలో కలిపి తుడవడం వల్ల నేలపై ఉండే సూక్ష్మజీవులు నశిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం ఉప్పుతో ఇల్లు తుడిస్తే నకారాత్మక శక్తి కూడా తొలగిపోతుంది.

వేప నూనె: వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు దోమలు, ఈగలను దూరంగా ఉంచుతాయి. కొన్ని చుక్కల వేప నూనెను నీటిలో కలిపి ఉపయోగించవచ్చు.

యూకలిప్టస్ నూనె: ల్యావెండర్ లేదా యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్‌ను కొన్ని చుక్కలు కలిపితే దోమలు ఇళ్లలోకి రావు, ఇల్లు కూడా రోజంతా ఫ్రెష్‌గా ఉంటుంది.

దీనికోసం బకెట్ నీటిలో 1 స్పూన్ ఉప్పు, 2-3 కర్పూరం బిళ్లల పొడి, అర కప్పు వెనిగర్ బాగా కలపండి. ఈ నీటితో ఇంట్లోని అన్ని మూలలు, తలుపుల వెనుక భాగాన్ని బాగా తుడవండి. ఈ చిన్న సహజమైన చిట్కాలను రోజూ పాటించడం ద్వారా మీ ఇల్లు పరిశుభ్రంగా, సువాసనభరితంగా మారడమే కాకుండా దోమలు, ఈగల నుండి పూర్తి రక్షణ లభిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఈగలు, దోమలు పరార్..! ఇల్లు తుడిచే నీటిలో ఇవి ఉంటే చాలు..
ఈగలు, దోమలు పరార్..! ఇల్లు తుడిచే నీటిలో ఇవి ఉంటే చాలు..
సేఫ్టీ టెక్నాలజీతో మార్కెట్లోకి వోక్స్​వ్యాగన్ ఎలక్ట్రిక్ సైకిల్
సేఫ్టీ టెక్నాలజీతో మార్కెట్లోకి వోక్స్​వ్యాగన్ ఎలక్ట్రిక్ సైకిల్
రాత్రిపూట అన్నం తింటే లావు అవుతారా..? అపోహలు కాదు అసలు నిజాలు..
రాత్రిపూట అన్నం తింటే లావు అవుతారా..? అపోహలు కాదు అసలు నిజాలు..
పసుపు రంగులో అదరగొడుతున్న డుకాటీ సూపర్ బైక్.. ఫీచర్లు తెలుసా
పసుపు రంగులో అదరగొడుతున్న డుకాటీ సూపర్ బైక్.. ఫీచర్లు తెలుసా
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము..ఒట్టి పిరికిదట! ఆ రహస్యం?
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము..ఒట్టి పిరికిదట! ఆ రహస్యం?
రెండు వేళ్లతో హెల్మెట్ ఫిట్టింగ్ టెస్ట్.. 2-2-2 రూల్ ఇదే
రెండు వేళ్లతో హెల్మెట్ ఫిట్టింగ్ టెస్ట్.. 2-2-2 రూల్ ఇదే
ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌లోకి బజాజ్‌ ఎంట్రీ.. ఎప్పుడంటే
ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌లోకి బజాజ్‌ ఎంట్రీ.. ఎప్పుడంటే
ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం..
ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం..
ఏపీ రైతులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లలోకే..
ఏపీ రైతులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లలోకే..
కేవలం 53 రోజుల్లోనే ఈ చిత్రాన్ని తీశారు..
కేవలం 53 రోజుల్లోనే ఈ చిత్రాన్ని తీశారు..