Health Tips: నిలబడి పాలు.. కూర్చొని నీళ్లు ఎందుకు తాగాలో తెలుసా..? ఆయుర్వేదం ఏం చెబుతుంది..

|

Jul 24, 2022 | 6:44 PM

మనం పాలు ఎందుకు నిలబడి తాగాలి.. నీళ్లు ఎందుకు కూర్చొని తాగాలి.. వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలామంది మాట్లాడుతుంటారు.

Health Tips: నిలబడి పాలు.. కూర్చొని నీళ్లు ఎందుకు తాగాలో తెలుసా..? ఆయుర్వేదం ఏం చెబుతుంది..
Health Tips
Follow us on

Right Way To Drink Milk and Water: ఏదైనా మనం అనుసరించే విధానానికి అనుగుణంగానే ఫలితం ఉంటుంది. కావున ఏదైనా మంచి లేదా చెడు జరగడానికి కారణం అనుసరించే విధానమేనని ప్రతి ఒక్కరూ పేర్కొంటుంటారు. అది వంటకి సంబంధించి అయినా.. చదువుకు సంబంధించినదైనా, మరేదైనా.. ఆయుర్వేదం ప్రకారం ఈ విషయం దాదాపు అన్ని విషయాలకు వర్తిస్తుంది. మనం పాలు ఎందుకు నిలబడి తాగాలి.. నీళ్లు ఎందుకు కూర్చొని తాగాలి.. వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలామంది మాట్లాడుతుంటారు. అయితే.. ఈ రెండు పనులను వ్యతిరేక మార్గంలో చేస్తే ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు. నిలబడి పాలు ఎందుకు తాగాలి, నీళ్లు కూర్చోని ఎందుకు తాగాలి.. వాటి కారణాలు ఎంటీ అనే విషయాలను తెలుసుకోండి..

పాలు నిలబడి ఎందుకు తాగాలి..

పాలు జలుబు, వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తాయి. అందువల్ల కూర్చొని పాలు తాగే వారు జీర్ణక్రియ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే ఆయుర్వేదంలో రాత్రి నిద్రపోయే ముందు లేదా సాయంత్రం రాత్రి భోజనం చేసిన రెండు గంటల తర్వాత పాలు నిలబడి తాగాలని సూచించారు. తద్వారా శరీరం దాని పూర్తి ప్రయోజనాలను పొందుతుంది.

ఇవి కూడా చదవండి

నిలబడి పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి..

  • మోకాళ్లకు హాని కలిగించదు
  • కండరాలకు మేలు చేస్తుంది
  • క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
  • గుండె జబ్బులు, రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది
  • కళ్ళు, చర్మానికి మేలు చేస్తుంది

నీరు కూర్చొని ఎందుకు తాగాలి..

నిలబడి నీరు తాగడం వల్ల ఆహారం, పేగులలో ఆక్సిజన్ సరఫరా సరిగా జరగకుండా ఆపివేస్తుందని పేర్కొంటున్నారు. ఇది ఊపిరితిత్తులు, గుండెపై కూడా ప్రభావం చూపుతుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల కూడా కీళ్లనొప్పులు, హెర్నియా వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఇలా చేయడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, జీర్ణ సమస్యలు కూడా రావచ్చు.

  • నీటిని కూర్చోని తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ వేగమవుతుంది.
  • శరీరంలోని అన్ని కణాలకు నీరు చేరుకోవడంలో సహాయపడుతుంది
  • శరీరానికి అవసరమైనంత ఎక్కువ నీటిని గ్రహించడంలో సహాయపడుతుంది
  • మూత్రం ద్వారా విషాన్ని బయటకు పంపుతుంది
  • రక్తంలో హానికరమైన పదార్థాలు కరిగిపోకుండా, రక్తం శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి