Pomegranate Uses: ఒక్క దానిమ్మ పండుతో వంద రోగాలకు చెక్ పెట్టొచ్చు!

దానిమ్మ పండు అంటే అందరికీ తెలుసు. చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. దానిమ్మ పండులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మ పండే కాకుండా.. ఈ చెట్టు ఆకులు, బెరడుతో కూడా దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. లేదంటే త్వరగా జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు..

Pomegranate Uses: ఒక్క దానిమ్మ పండుతో వంద రోగాలకు చెక్ పెట్టొచ్చు!
Pomegranate
Follow us

|

Updated on: Apr 16, 2024 | 3:18 PM

దానిమ్మ పండు అంటే అందరికీ తెలుసు. చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. దానిమ్మ పండులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మ పండే కాకుండా.. ఈ చెట్టు ఆకులు, బెరడుతో కూడా దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. లేదంటే త్వరగా జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పాలీ ఫెనాల్స్.. శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ప్రతీ రోజూ వీలుకాకపోయినా.. తరచూ దానిమ్మ తీసుకుంటే.. అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ తింటే ఎలాంటి సమస్యలతో జాగ్రత్తగా ఉండొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాన్సర్‌కు చెక్:

దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ లభిస్తాయి. కాబట్టి దీన్ని ఏ రూపంలో తీసుకున్నా.. కేన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి. బ్రెస్ట్ కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్ రాకుండా కాపాడుతుందని.. పలు పరిశోధనల్లో తేలింది. క్యాన్సర్ ఉన్నవారు తిన్నా త్వరగా కోలుకుంటారు.

బ్రెయిన్ యాక్టీవ్:

దానిమ్మ తినడం వల్ల మెదడు పని తీరు మెరుగు పడుతుంది. బ్రెయిన్ యాక్టీవ్‌గా మారి.. దాని పనిని వేగవంతంగా చేస్తుంది. పిల్లలు, పెద్దలు ఈ పండు తినడం వల్ల మెమరీ పవర్ పెరగడమే కాకుండా.. అల్జీమర్స్ సమస్య రాకుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

చర్మం ఆరోగ్యంగా ఉంటుంది:

దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అనేవి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి తరచూ దానిమ్మ తింటే.. చర్మం హెల్దీగా ఉంటుంది. ముడతలు ఏర్పడకుండా.. వృద్ధాప్య ఛాయలు రాకుండా.. స్కిన్ టోన్‌ను మెరుగు పరుస్తుంది.

రోగ నిరోధక శక్తి:

దానిమ్మ పండు తింటే.. శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీంతో జబ్బులతో పోరాడే శక్తి లభిస్తుంది. ఈ పండు తింటే తక్షణమే ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి.

గుండె ఆరోగ్యం:

దానిమ్మ పండు తిన్నా, జ్యూస్ తాగినా.. బీపీ అనేది అదుపులో ఉంటుంది. అంతే కాకుండా మంచి కొలెస్ట్రాల్ లెవల్స్‌ పెరుగుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..