TV9 Telugu

28 April 2024

రోజూ అంజీర్‌ తింటే.. 

రాత్రి పడుకునే సమయంలో అంజీర్‌ పండ్లను తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. ఇందులో పుష్కలంగా లభించే ఫైబర్‌ ఇందుకు కారణం. 

ఇక కాల్షియంకు కూడా అంజీర్‌ పెట్టింది పేరు. క్రమంతప్పకుండా అంజీర్‌ను తీసుకోవడం వల్ల ఎముకలకు అవసరమైన కాల్షియం లభిస్తుంది.

అంజీర్‌లో తక్కువ కేలరీలు ఉంటాయి. అలాగే కొన్ని తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో అంజీర్‌ పండ్లను నిత్యం డైట్‌లో భాగం చేసుకుంటే బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.

అంజీర్‌లో క్లోరోజెనిక్ యాసిడ్, పొటాషియంలు ఉంటాయి. ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.

మహిళల్లో సంతానోత్పత్తిని పెంచడంలోనూ అంజీర్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని జింక్‌, మెగ్నీషియం, ఐరన్‌ మేలు చేస్తాయి.

నానబెట్టిన అంజీర్‌ను ప్రతీ రోజూ ఉదయం తీసుకుంటే శరీరంలోని టాక్సిన్స్ దూరమవుతాయి. ఇది చర్మాన్ని కాంతివంతం చేయడంలో ఉపయోగపడుతుంది.

అంజీర్‌లోని ఎన్నో ఔషధ గుణాలు గుండె సమస్యల బారినపడకుండా ఉండడంలో ఉపయోగపడతాయి. అలాగే క్యాన్సర్‌ కారకాలకు కూడా చెక్‌ పెడుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.