Bobby Deol: కన్నీళ్లు పెట్టుకున్న యానిమల్ విలన్.. ఎందుకు ఎమోషనల్ అయ్యాడో తెలుసా..

మన హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఈ టాక్ షోలో పాల్గొన్నారు. సాహో సమయంలో ప్రభాస్, ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఇక  గత ఎపిసోడ్‌లో స్టార్ హీరో అమీర్ ఖాన్ పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా ఈ షోకి సన్నీ డియోల్, బాబీ డియోల్ గెస్ట్‌లుగా వచ్చారు.

Bobby Deol: కన్నీళ్లు పెట్టుకున్న యానిమల్ విలన్.. ఎందుకు ఎమోషనల్ అయ్యాడో తెలుసా..
Bobby Deol
Follow us

|

Updated on: Apr 30, 2024 | 8:12 PM

బాలీవుడ్ ప్రముఖ టాక్ షో  ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. చాలా మంది సెలబ్రెటీలు ఈ షోకు హాజరై ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మన హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఈ టాక్ షోలో పాల్గొన్నారు. సాహో సమయంలో ప్రభాస్, ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఇక  గత ఎపిసోడ్‌లో స్టార్ హీరో అమీర్ ఖాన్ పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా ఈ షోకి సన్నీ డియోల్, బాబీ డియోల్ గెస్ట్‌లుగా వచ్చారు. ఈ కొత్త ఎపిసోడ్‌లు నెట్ ఫ్లిక్స్ లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఈ టాక్ షో చాలా సరదాగా జోక్స్ తో కామెడీగా సాగుతుంది.  కానీ ఈ షో లో బాబీ డియోల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనికి సంబందించిన ప్రోమో నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియా లో షేర్ చేసింది.

డియోల్ ఫ్యామిలీ ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుంది. 2023లో విడుదలైన సన్నీ డియోల్ ‘గదర్ 2’, బాబీ డియోల్ ‘యానిమల్’, ధర్మేంద్ర ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ సూపర్ హిట్ అయ్యాయి. ఈ విషయం గురించి సన్నీ డియోల్ మాట్లాడినప్పుడు బాబీ డియోల్ భావోద్వేగానికి గురయ్యాడు. 1960ల నుంచి సినిమా రంగంలో ఉన్నాం. అయితే గత కొన్నేళ్లుగా ఎంత ప్రయత్నించినా హిట్ అందుకోలేకపోయాం.. ఎందుకో తెలియలేదు. కానీ 2023లో నా కొడుకు పెళ్లి, ఆ తర్వాత ‘గదర్ 2’ సినిమా వచ్చింది. అంతకు ముందు నాన్న సినిమా విజయం సాధించింది. తర్వాత ‘యానిమల్’ సినిమా వచ్చి దుమ్మురేపింది. ఈ విజయలన్ని ఎవరి దీవెనల వల్ల వచ్చాయో తెలియడం లేదు’ అని సన్నీ డియోల్ చెబుతుండగా పక్కనే కూర్చున్న బాబీ డియోల్ కంటతడి పెట్టుకున్నాడు.

‘గదర్ 2’ విజయం తర్వాత సన్నీ డియోల్ డిమాండ్ మళ్లీ పెరిగింది. ఆయన కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అలాగే ‘యానిమల్’ సినిమా విజయం సాధించడంతో బాబీ డియోల్ కు మరిన్ని ఆఫర్లు వచ్చాయి. సౌత్ ఇండియన్ సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. తెలుగులోనూ ఆయన నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో పాటు బాలయ్య నటిస్తున్న సినిమాలోనూ బాబీ డియోల్ నటిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles