
మెదడులో సమాచారాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచేందుకు షిచిడా పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ విధానంలో సమాచారాన్ని రంగుల బొమ్మలు లేదా కథల రూపంలో ఊహించుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు, ఒక జాబితాను గుర్తుంచుకోవాలంటే, దానిని ఒక సజీవ కథగా మార్చి, మెదడు సృజనాత్మక భాగాన్ని ఉత్తేజపరచడం ద్వారా గుర్తుంపు సులభమవుతుంది. ఈ పద్ధతి జపాన్ విద్యా విధానాల్లో విస్తృతంగా ఉపయోగిస్తుంటారు.
ఎన్-బ్యాక్ టెక్నిక్ మెదడు గుర్తుంచుకునే సామర్థ్యాన్ని, ఏకాగ్రతను పెంచే మానసిక వ్యాయామం. ఈ పద్ధతిలో ఒక వరుసలోని అంశాలను కొన్ని దశల ముందు నుంచి గుర్తుచేసుకోవాలి. ఉదాహరణకు, రెండు లేదా మూడు అంశాల ముందు ఉన్న వాటిని గుర్తుంచుకోవడం. ఈ విధానం ద్వారా క్రమంగా మెదడు పనితీరు మెరుగుపడి, సమాచారాన్ని త్వరగా గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది.
సంక్లిష్ట సమాచారాన్ని చిన్న, సులభమైన భాగాలుగా విభజించడం చంకింగ్ పద్ధతి యొక్క ప్రధాన ఉద్దేశం. జపాన్ కాంజీ అక్షరాలను నేర్చుకునే విధానం నుంచి ఈ టెక్నిక్ పుట్టింది. ఉదాహరణకు, ఒక పెద్ద సంఖ్యను గుర్తుంచుకోవాలంటే, దానిని చిన్న సమూహాలుగా విభజించి నేర్చుకోవడం ద్వారా మెదడుకు సులభతరం అవుతుంది. ఈ విధానం సమాచారాన్ని వ్యవస్థీకరించడంలో సహాయపడుతుంది.
సమాచారాన్ని దీర్ఘకాలం గుర్తుంచుకోవడానికి స్పేస్డ్ రిపిటీషన్ అనేది ఒక శక్తివంతమైన పద్ధతి. ఈ టెక్నిక్‌లో సమాచారాన్ని నిర్దిష్ట వ్యవధులలో (ఉదాహరణకు, 1 రోజు, 3 రోజులు, 7 రోజులు) పునరావృతం చేయడం జరుగుతుంది. భాషా నేర్చుకోవడంలో ఈ పద్ధతి ఎక్కువగా ఉపయోగించబడుతుంది. క్రమం తప్పకుండా పునరావృతం చేయడం వల్ల మెదడు సమాచారాన్ని బలంగా నిలుపుకుంటుంది.
మైండ్ మ్యాపింగ్ అనేది సమాచారాన్ని దృశ్య రూపంలో రూపొందించే పద్ధతి. ఒక కేంద్ర ఆలోచన చుట్టూ సంబంధిత విషయాలను చిత్రం లేదా రేఖాచిత్రం రూపంలో అనుసంధానం చేయడం ద్వారా ఈ టెక్నిక్ పనిచేస్తుంది. ఈ విధానం సమాచారాన్ని వ్యవస్థీకరించడంతో పాటు, దానిని సులభంగా గుర్తుంచుకోవడంలో సహాయపడుతుంది. జపాన్ విద్యార్థులు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.
ఫురుసాటో టెక్నిక్ సమాచారాన్ని మనసుకు సుపరిచితమైన స్థలాలు లేదా వ్యక్తిగత జ్ఞాపకాలతో అనుసంధానం చేసే పద్ధతి. ఉదాహరణకు, మీ సొంత ఊరిలోని ఒక ప్రదేశంతో సమాచారాన్ని జోడించడం ద్వారా భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. ఈ భావోద్వేగ అనుబంధం మెదడులో సమాచారాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచడంలో సహాయపడుతుంది.