Curry Leaves Tea : డయాబెటిస్ వారికి ఫ్రెండ్లీ టీ కరివేపాకు టీ.. ఇది తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే వదలురుగా..!

|

Feb 28, 2021 | 3:30 PM

భారతీయుల వంటకాల్లో పూర్వకాలం నుంచి కరివేపాకుకు విశిష్ట స్థానం ఉంది. మనం వండుకునే ఆహారపదార్ధాలకు మంచి రుచిని, సువాసన ను ఇవ్వడంలో కరివేపాకుకి ప్రత్యేక స్థానం...

Curry Leaves Tea : డయాబెటిస్ వారికి ఫ్రెండ్లీ టీ కరివేపాకు టీ.. ఇది తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే వదలురుగా..!
Follow us on

Curry Leaves Tea : భారతీయుల వంటకాల్లో పూర్వకాలం నుంచి కరివేపాకుకు విశిష్ట స్థానం ఉంది. మనం వండుకునే ఆహారపదార్ధాలకు మంచి రుచిని, సువాసన ను ఇవ్వడంలో కరివేపాకుకి ప్రత్యేక స్థానం ఉంది. కూరల్లో తాలింపుగా ఉపయోగించే ఈ కరివేపాకులో ఎన్నోఔషధాలున్నాయి. ఇది వంటల్లో వాడుకోవడానికె కాదు.. టీ రూపంలో కూడా తాగవచ్చు. కరివేపాకుతో తయారు చేసిన టీ రోజూ తాగితే అనేక ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతిరోజు కరివేపాకు టీని తాగాలని వారు సూచిస్తున్నారు. కరివేపాకు టీ తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. రోజూ ఇదో హాబీగా మార్చేసుకుంటారు. మరి ఈ టీ తయారీ చేయడం ఎలా.. ఈ టీ వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం..!

కరివేపాకు టీ తయారీ:

25 నుంచి 30 కరివేపాకులను తీసుకొని.. శుభ్రంగా కడగండి.. అనంతరం ఓ గిన్నెలో ఓ కప్పు నీరు తీసుకుని బాగా వేడి చేయండి..మంట ఆర్పేసి.. ఆ వేడి నీటిలో కడిగిన కరివేపాకుల్ని వేయండి.. ఆకులన్నీ ఆ వేడి వేడి నీటిలో మునిగేలా చేయండి.. నీటి రంగు మారడాన్ని గమనించండి.. అనంతరం ఆ నీటిని కప్పులోకి ఫిల్టర్ చేయండి. ఈ నీటిలో తేనే, బెల్లం కలిపి తాగవచ్చు.. బెల్లం కంటే నల్లబెల్లం కలుపుకుని తాగితే అధిక ప్రయోజనం.. అంతేకాదు ఆ నీటిలో తేనే, నిమ్మరసం, కలిసికూడా తాగవచ్చు.

కరివేపాకు టీ వల్ల కలిగే ప్రయోజనాలు :

* ఈ కరివేపాకు టీ తాగితే మూత్రాశయం బాగా పనిచేస్తుంది. పొట్టలో గ్యాస్, మూత్ర విరేచనాల సమస్య నయమవుతుంది. కరివేపాకుల్లో తేలికపాటి భేదిమందు లక్షణాలు, జీర్ణ ఎంజైములు ఉంటాయి. ఇవి మీ ప్రేగు కదలికను మెరుగుపరుస్తాయి.. తద్వారా జీర్ణక్రియ వేగవంతంగా పనిచేస్తుంది.

* ఈ టీ తాగడం వల్ల కడుపులోని సమస్యలు తగ్గుతాయి. తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది.

*మధుమేహం ఉన్నవారు.. షుగర్ ఫ్రీ టీనే తాగాలని అనుకునేవారికి కరివేపాకు టీ మంచి ఔషధంగా చెప్పుకోవచ్చు. ఇది షుగర్ లెవెల్స్‌ను పెంచుకుండా కంట్రోల్‌లో ఉంచుతుంది.

* గర్భిణులకు కరివేపాకు టీ బాగా ఉపయోగపడుతుంది. నీరసం, వికారం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది.

* ఎవరైనా విరోచనాలతో బాధపడుతుంటే వారు ఈ టీ తాగితే.. అప్పుడు కలిగే నీరసాన్ని తగ్గిస్తుంది.

*కరివేపాకులో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్లు, ఫెనొలిక్స్ చర్మాన్ని నాశనం చేసే ఫ్రీ-ర్యాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతోపాటుగా చర్మంపై మంట, ఇన్‌ఫెక్షన్స్ లాంటివి రాకుండా కరివేపాకు టీ సహాయపడుతుంది.

*కరివేపాకులో ఉండే అరోమా.. నరాలను రిలాక్స్ చేసి.. ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి రోజంతా పని చేసి అలసిపోయిన వారు కచ్చితంగా కరివేపాకు టీ తాగడం వల్ల టెన్షన్, ఒత్తిడి నుంచి వెంటనే విముక్తి అవుతారు.

కరివేపాకు చెట్టులో అన్నిటికీ ఔషధపరమైన ఉపయోగాలున్నాయి. కరివేపాకు ఆకులు, కరివేపాకు కాయలు, వేరు పై బెరడు, కాండం పై బెరడు ఇలా అన్నిటినీ ఔషధ రూపంలో వాడతారు.

Also Read:

భారత్‌లో పిరమిడ్స్ .. మహాభారతానికి సజీవ సాక్ష్యం.. అర్జునుడు గురువుకి దక్షిణ ఇచ్చిన ప్రాంతం ఎక్కడో తెలుసా..!

అక్కడ ఇచ్చిన మర్యాద ఇక్కడ దొరకలేదు .. ఆసక్తికర విషయాలు చెప్పిన జగ్గూభాయ్..