Health Tips: తిన్న తర్వాత ఈ 5 మినట్ రూల్ పాటించండి.. షుగర్ జన్మలో రాదు..

రోజంతా పని చేసి అసలు వ్యాయామానికి సమయమే ఉండట్లేదని బాధపడేవారికోసమే ఇది. మీరు నిజంగా మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని అనుకుంటే అందుకు పెద్ద పెద్ద ప్రణాళికలు, వేలకు వేలు పోసి జిమ్ మెంబర్షిప్ లు తీసుకోవాల్సిన పనిలేదు. కేవలం తిన్న తర్వాత ఒక 5 నిమిషాలు మీకోసం మీరు కేటాయించకోగలిగితే చాలు. తాజా అధ్యయనాలు ఇదే విషయాన్ని చెప్తున్నాయి. మీరు రోజూవారి పనులతో అలసిపోయి ఉన్నా సరే శరీరానికి ఏమాత్రం కష్టం కలగకుండా చేయగలిగే చిన్న టెక్నిక్ ఇది..

Health Tips: తిన్న తర్వాత ఈ 5 మినట్ రూల్ పాటించండి.. షుగర్ జన్మలో రాదు..
After Meal Simple Walking

Updated on: Feb 24, 2025 | 4:51 PM

రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల లాభాలున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడటం, రక్తపోటు తగ్గడం, బరువు తగ్గడం వంటి ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్రయోజనాల కోసం మీరు రోజులో కచ్చితంగా కేవలం రెండు నిమిషాలను కేటాయించాలని అధ్యయనాలు చెప్తున్నాయి. తిన్న తర్వాత 5 నిమిషాల నడక మొత్తం మీ ఆరోగ్యానికి శ్రీ రామరక్షగా మారుతుందని పరిశోధకులు వెల్లడించారు. అదనంగా, నడక ఒత్తిడిని మేనేజ్ చేయగలదు. నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎలాంటి ప్లానింగ్ లేకపోయినా రోజువారీ దినచర్యలో 5 నిమిషాలను కేటాయించినా మీకు షుగర్ వచ్చే ముప్పు గణనీయంగా తగ్గుతుంది..

షుగర్ రాకుండా చేస్తుంది..

నడక అనేది తక్కువ కష్టంతో కూడిన ఉత్తమమైన వ్యాయామం. ఎలాంటి బరువులెత్తే పనిలేకుండా ఈ చిన్న పనితోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. దీనికి ఎటువంటి పరికరాలు అవసరం లేదు. అన్ని వయసుల వ్యక్తులు దీన్ని చేయడం సురక్షితం. ముఖ్యంగా, రోజంతా ఫిజికల్ గా ఎక్కువగా శ్రమ లేని వారు ఇలా రాత్రి భోజనం తర్వాత 5 నిమిషాల నడక చాలా ఉపయోగపడుతుంది.

బీపీ ఉందా..

మొదట 2 నుండి 5 నిమిషాల చిన్న నడకతో ప్రారంభించండి. ఎంతసేపు నడిచాం అనేదానికన్నా ఎంత ఎక్కువ కాలం ఈ అలవాటు కొనసాగించాం అనేది చాలా ముఖ్యం. ఇటీవలి అధ్యయనం ప్రకారం, భోజనం తర్వాత కేవలం రెండు నిమిషాలు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించగలవు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది రక్తపోటు తగ్గుతుంది. బరువు తగ్గడంలో, హార్మోన్ నియంత్రణ వల్ల మానసిక స్థితిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.

జీర్ణ సమస్యలు దూరమవుతాయి..

భోజనం తర్వాత తేలిక పాటి నడక వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వ్యాయామం కంటే ఎక్కువ ఎఫెక్టివ్ గా తగ్గుతాయని ఓ పరిశోధన సూచిస్తుంది. భోజనం ముగించిన వెంటనే నడవడం ప్రారంభించినప్పుడు ఇన్సులిన్ స్థాయిలు మరింత స్థిరంగా ఉంటాయని, తిన్న తర్వాత 60 మరియు 90 నిమిషాల మధ్య రక్తంలో చక్కెర పెరుగుతుంది కాబట్టి, సరైన ఫలితాలు సాధించవచ్చని అధ్యయనం కనుగొంది. ఇది మెరుగైన జీర్ణక్రియను, ప్రేగులను ప్రేరేపిస్తుంది, జీర్ణవ్యవస్థ ద్వారా వేగవంతమైన ఆహార కదలికను సులభతరం చేస్తుంది. ముఖ్యంగా

కడుపు ఉబ్బరానికి..

జీర్ణం కాని ఆహారం తినడం త్రాగేటప్పుడు బయటి నుంచి కొంత గాలి లోపలికి వెళ్తుంది. జీర్ణవ్యవస్థలో ఈ గ్యాస్ పేరుకుపోయి కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది. అందుకే తిన్నవెంటనే నడక మీరు తిన్నది పూర్తిగా జీర్ణం అవడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం పెద్ద స్థలం కూడా అవసరం లేదు. మీ వరండాలోనో.. లేదా లిఫ్ట్ వరకో నాలుగు అడుగులు అటూ ఇటూ తేలికగా తిరిగితే సరిపోతుంది. ఇది మీకు మంచి నిద్రకు కూడా ఉపయోగపడుతుంది.