గుడ్ న్యూస్.. క్లినికల్ ట్రయిల్స్‌కు మరో కరోనా వ్యాక్సిన్..

తాజాగా మరో కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయిల్స్‌కు ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారతీయ ఫార్మా కంపెనీ అయిన 'జైడస్' తయారు చేసిన కోవిడ్ 19 టీకా 'జైకోవ్- డి'..

గుడ్ న్యూస్.. క్లినికల్ ట్రయిల్స్‌కు మరో కరోనా వ్యాక్సిన్..

Updated on: Jul 04, 2020 | 3:00 PM

ZyCoV-D: దేశంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను వేగవంతం చేసింది. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రూపొందించిన ‘కోవాగ్జిన్’ టీకాపై ప్రయోగాలు నిర్వహించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని రెండు కేంద్రాలతో పాటుగా దేశంలో మొత్తంగా 12 సెంటర్లను ఐసీఎంఆర్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

Also Read: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక నుంచి టికెట్‌లెస్ ప్రయాణం..!

ఇప్పుడు తాజాగా మరో కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయిల్స్‌కు ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారతీయ ఫార్మా కంపెనీ అయిన ‘జైడస్’ తయారు చేసిన కోవిడ్ 19 టీకా ‘జైకోవ్- డి’ క్లినికల్ ట్రయిల్స్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భారత్ బయోటెక్ సంస్థ తర్వాత మనుషులపై క్లినికల్ ట్రయిల్స్‌కు అనుమతి పొందిన రెండో కంపెనీగా జైడస్ నిలిచింది. కాగా, జంతువులపై జరిపిన ప్రయోగాల్లో సత్ఫలితాలు వచ్చాయని.. ఇప్పుడు మనుషులపై ప్రయోగించేందుకు అనుమతి లభించిందని జైడస్ సంస్థ ఎండీ పంకజ్ పటేల్ వెల్లడించారు. ఈ నెలలోనే సుమారు 1,000 మంది కరోనా రోగులపై ట్రయిల్స్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Also Read: వినియోగదారులకు అలెర్ట్.. ఆధార్ లేకుంటే ఆ మూడు సేవలు అసాధ్యం.!

కరోనా వైరస్ సోకడానికి ‘S’ ప్రోటీన్ ఎపిటోప్‌లు కారణమని కనుగొన్న వెంటనే మార్చి నెల నుంచి వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాం. ఆ ప్రకారం టీకాను రూపొందించి ఎలుకలు, పందులు, కుందేళ్లు వంటి వాటిపై ట్రయిల్స్ నిర్వహించాం. ఈ ఫేజ్‌లలో మంచి ఫలితాలు రావడంతో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు మేము రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ప్రోటోకాల్‌ను సబ్మిట్ చేశాం. ఇక వారు దీన్ని ఆమోదించడంతో మనుషులపై క్లినికల్ ట్రయిల్స్ నిర్వహించేందుకు సిద్దమవుతున్నాం.

Also Read: గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు మరో ఛాన్స్.. గడువు పొడిగింపు..!