Local polls: ఏపీలో జడ్పీ రిజర్వేషన్లు ఇవే

|

Mar 06, 2020 | 7:12 PM

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. మార్చి మూడో వారంలో రెండు విడతలుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అవుతోంది.

Local polls: ఏపీలో జడ్పీ రిజర్వేషన్లు ఇవే
Follow us on

ZP reservations finalized in Andhra Pradesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. మార్చి మూడో వారంలో రెండు విడతలుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. అయితే.. కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశమై.. తాజాగా కోర్టు ముంగిట్లో వున్న రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చింది. ముందుగా జిల్లా పరిషత్తుల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

చిత్తూరు, కర్నూలు, కడప, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మెన్ పదవులను జనరల్ కేటగిరీలో నోటిఫై చేశారు. ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జడ్పీ చైర్మెన్ పోస్టులను జనరల్ మహిళలకు కేటాయించారు. అనంతపురం జడ్జీ ఛైర్మెన్ పోస్టును బీసీ మహిళకు కేటాయించగా.. తూర్పుగోదావరి – ఎస్సీ, గుంటూరు – ఎస్సీ మహిళ, శ్రీకాకుళం – బీసీ మహిళ, విశాఖపట్నం – ఎస్టీ మహిళ, పశ్చిమగోదావరి – బీసీ జనరల్‌లకు కేటాయిస్తూ గెజిట్ విడుదలైంది.

రాష్ట్రంలో మొత్తం 13 జిల్లా పరిషత్‌లుండగా.. వాటికి రిజర్వేషన్లను ఖరారు చేస్తూ రాష్ట్ర స్థాయిలో గెజిట్ విడుదలైంది. మండలాల వారీగా రిజర్వేషన్ల వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫై చేయనున్నారు. రేపటికి మొత్తం క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.