
టీటీడీ ఛైర్మన్‌గా వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఈ ఉదయం కాలినడకన తిరుమలకు వెళ్లిన సుబ్బారెడ్డి.. శ్రీవారి దర్శనానంతరం టీటీడీ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తిరుమల ప్రధానార్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ.. తిరుమల కొండ ప్రతిష్టను పెంచే విధంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. స్వామి వారి ఆభరణాల మాయం, ప్రధానార్చకుల తొలగింపు లాంటి అపనిందనలపై పూర్తి స్థాయిలో చర్చించి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఇవాళ తానొక్కడినే టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించానని.. వారం రోజుల్లో పూర్తి స్థాయిలో పాలకమండలిని ఏర్పాటు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.