ఏపీ హోంమంత్రి ముందే కార్యకర్తల ఫైట్..

|

Mar 10, 2020 | 12:47 PM

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార పార్టీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. ఏకంగా హోంమంత్రి మేకతోటి సుచరిత సమక్షంలోనే  కార్యకర్తలు బాహాబాహికి దిగడం తీవ్ర చర్చనీయాంశమైంది. మంత్రి సొంత నియోజకవర్గంలోని  ప్రత్తిపాడులో కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేయగా..ఈ గొడవ జరిగింది. కాకుమానులోని విష్ణు ఆలయ కల్యాణ మండపంలో…స్థానిక సంస్థలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇదే సమయంలో రేటూరు ఆలయ ట్రస్టు సభ్యుల నియామకమంపై కూడా చర్చ జరిగింది.  ఇక్కడే రెండు వర్గాలు తమ, […]

ఏపీ హోంమంత్రి ముందే కార్యకర్తల ఫైట్..
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార పార్టీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. ఏకంగా హోంమంత్రి మేకతోటి సుచరిత సమక్షంలోనే  కార్యకర్తలు బాహాబాహికి దిగడం తీవ్ర చర్చనీయాంశమైంది. మంత్రి సొంత నియోజకవర్గంలోని  ప్రత్తిపాడులో కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేయగా..ఈ గొడవ జరిగింది. కాకుమానులోని విష్ణు ఆలయ కల్యాణ మండపంలో…స్థానిక సంస్థలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇదే సమయంలో రేటూరు ఆలయ ట్రస్టు సభ్యుల నియామకమంపై కూడా చర్చ జరిగింది.  ఇక్కడే రెండు వర్గాలు తమ, తమ సభ్యులను ప్రతిపాదించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఓ కార్యకర్తపై, మరో వర్గం కార్యకర్త దాడికి యత్నించాడు. పోలీసులు జోక్యం చేసుకుని..ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో కార్యకర్తలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు హోంమంత్రి. పద్దతిగా కూర్చోని మాట్లాడుకోవాలి తప్ప..ఇటువంటి భౌతిక దాడులు కరెక్ట్ కాదని క్యాడర్‌కు సూచించారు. అందరికీ న్యాయం జరుగుతుందని, ఎవరికి టికెట్ ఇచ్చినా అన్ని వర్గాలు మద్దతు తెలిపి గెలిపించాలని ఆమె సూచించారు.