విశాఖ యూత్‌పై గంజాయి పంజా..

తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్‌, గంజాయి, మత్తుమందు కేసులు వెలుగు చూసిన ప్రతిసారి వీఐపీలు, ప్రముఖుల పేర్లు తెరమీదకు రావటం విస్మయానికి గురిచేస్తుంది. ముఖ్యంగా ప్రముఖుల పిల్లలే ఎక్కువగా ఈ డ్రగ్స్‌ కేసుల్లో పట్టుబడుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా, విశాఖపట్నంలో బయటపడ్డ గంజాయి స్మగ్లింగ్‌ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. నిందితుల్లో హెడ్‌కానిస్టేబుల్‌, డీఎస్పీ స్థాయి అధికారుల పిల్లలు ఉన్నట్లుగా పోలీసు విచారణలో తేలింది. ఇటీవల విశాఖపట్నం జిల్లా కూర్మన్నపాలెంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నలుగురు […]

విశాఖ యూత్‌పై గంజాయి పంజా..

Updated on: Jan 24, 2020 | 7:19 PM

తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్‌, గంజాయి, మత్తుమందు కేసులు వెలుగు చూసిన ప్రతిసారి వీఐపీలు, ప్రముఖుల పేర్లు తెరమీదకు రావటం విస్మయానికి గురిచేస్తుంది. ముఖ్యంగా ప్రముఖుల పిల్లలే ఎక్కువగా ఈ డ్రగ్స్‌ కేసుల్లో పట్టుబడుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా, విశాఖపట్నంలో బయటపడ్డ గంజాయి స్మగ్లింగ్‌ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. నిందితుల్లో హెడ్‌కానిస్టేబుల్‌, డీఎస్పీ స్థాయి అధికారుల పిల్లలు ఉన్నట్లుగా పోలీసు విచారణలో తేలింది. ఇటీవల విశాఖపట్నం జిల్లా కూర్మన్నపాలెంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను వెంబడించారు పోలీసులు. గంజాయి స్మగ్లింగ్‌ ముఠాలో ఇద్దరు యువకులు పట్టుబడగా, మరో ఇద్దరు పరారైనట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన యువకులను విచారించగా పోలీసులకే షాక్‌ తగిలే నిజాలు బయటపడ్డాయి. పట్టుబడిన ఇద్దరు యువకుల్లో ఒకరు హెడ్‌కానిస్టేబుల్‌ కొడుకు మోనీష్‌, పారిపోయిన వారిలో డీఎస్పీ కొడుకు మనోజ్‌ ఉన్నట్లుగా తేలింది.

వీరంతా శుభకార్యం కోసం కారులో విశాఖ వచ్చారని, ఏజెన్సీలో బ్రోకర్ల ద్వారా గంజాయిని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మోనీష్‌, మన్సూర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించారు. వారు ప్రయాణించిన కారును సీజ్‌ చేశారు. మరోవైపు పారిపోయిన మనోజ్‌, బాబీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరంతా గుంటూరు, ప్రకాశం, విజయవాడకు చెందిన వారుగా గుర్తించారు.  విశాఖ ఏజెన్సీ అడ్డగా చేసుకుని మత్తు పదార్థాల స్మగ్లింగ్‌ జోరుగా సాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే, విద్యార్థులే ఎక్కువగా ఈ గంజాయిలో తరిస్తూ పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. కూర్మన్న పాలెంలో పట్టుబడిన వారు ఇంజినీరింగ్‌ విద్యార్థులుగా గుర్తించారు. కాగా, గతంలో ముగ్గురు మెడికోలు, మరో ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు దొరికిపోయారు. అయితే, గంజాయి కేసులో పట్టుబడిన వారిపై చర్యలు చాలా కఠినంగా ఉంటాయంటున్నారు పోలీసులు. దీంతో విశాఖ యువత ఎటు పోతుందనే ఆందోళన స్థానికులను మరింత కలవరపెడుతోంది