పోలీస్ వాహనంపై పుషప్స్.. వైరల్ అవుతున్న టిక్‌టాక్ వీడియో

జనాలకు టిక్‌టాక్ పిచ్చి బాగా ముదిరిపోయింది. వెరైటీ వీడియోలు తీస్తూ అందరిలో శభాష్ అనిపించుకోవాలనే ఆలోచనతో ఒక్కోసారి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్న సంఘటనలు ఈమధ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. పచ్చని కాపురాల్లో టిక్‌‌టాక్ చిచ్చుపెడుతుంటే.. నిండు ప్రాణాలు సైతం కోల్పోవాల్సి వస్తోంది. ఇటీవల రాజస్ధాన్‌లో ఓ బాలుడు తల్లి మంగళసూత్రం తలుపు సందులో ఇరుక్కుని దుర్మరణం పాలైతే.. మరో యువకుడు మెడ విరిగి మరణించాడు. తాజాగా ఓ యువకుడు టిక్‌టాక్ ద్వారా బాగా పాపులర్ కావాలనే ఉద్దేశంతో కదులుతున్న కారుపైకి […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:26 pm, Thu, 27 June 19
పోలీస్ వాహనంపై పుషప్స్..  వైరల్ అవుతున్న టిక్‌టాక్ వీడియో

జనాలకు టిక్‌టాక్ పిచ్చి బాగా ముదిరిపోయింది. వెరైటీ వీడియోలు తీస్తూ అందరిలో శభాష్ అనిపించుకోవాలనే ఆలోచనతో ఒక్కోసారి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్న సంఘటనలు ఈమధ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. పచ్చని కాపురాల్లో టిక్‌‌టాక్ చిచ్చుపెడుతుంటే.. నిండు ప్రాణాలు సైతం కోల్పోవాల్సి వస్తోంది. ఇటీవల రాజస్ధాన్‌లో ఓ బాలుడు తల్లి మంగళసూత్రం తలుపు సందులో ఇరుక్కుని దుర్మరణం పాలైతే.. మరో యువకుడు మెడ విరిగి మరణించాడు.

తాజాగా ఓ యువకుడు టిక్‌టాక్ ద్వారా బాగా పాపులర్ కావాలనే ఉద్దేశంతో కదులుతున్న కారుపైకి ఎక్కి పుషప్స్ తీస్తూ వీడియో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ యువకుడు ఎక్కిన కారుమీద ఢిల్లీ పోలీస్ అని రాసి ఉండటంతో ఈ వీడియో వివాదాస్పదంగా మారింది. దీన్ని గుర్తించిన ఢిల్లీ పోలీసులు ఈ వీడియోను పరిశీలించి ఆ యువకుడు పోలీస్ కాదని, అసలు అది పోలీస్ వాహనమే కాదని నిర్ధారించారు. మరోవైపు సెల్ఫ్ ఇమేజ్ కోసం ఇలాంటి విన్యాసాలు చేస్తున్న సదరు వ్యక్తికి,కారు యజమానికి నోటీసులు జారీ చేసారు.