అందంగా లేనని విద్యార్థి ఆత్మహత్య..!

ఆందానికి మారు పేరు అమ్మాయిలు. అందం మెరుగులు దిద్దుకోవడానికి గంటల సమయం అందం ముందు అతుక్కుపోతారు. అలాంటిది ఓ అబ్బాయి అందం కోసం అరాటపడ్డాడు. ముఖంపై మొటిమలు, మచ్చలు ఉన్నాయని మనస్తాపం చెందిన ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.

అందంగా లేనని విద్యార్థి ఆత్మహత్య..!

Updated on: Jun 29, 2020 | 2:41 PM

ఆందానికి మారు పేరు అమ్మాయిలు. అందం మెరుగులు దిద్దుకోవడానికి గంటల సమయం అందం ముందు అతుక్కుపోతారు. అలాంటిది ఓ అబ్బాయి అందం కోసం అరాటపడ్డాడు. ముఖంపై మొటిమలు, మచ్చలు ఉన్నాయని మనస్తాపం చెందిన ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.
మాణిక్యపురానికి చెందిన సునీల్‌ నాయక్‌ (20) డిగ్రీ చదువుతున్నాడు. చిన్ననాటి నుంచీ ముఖంపై మచ్చలు ఉన్నాయి. అయితే కాలేజీ చదువు ప్రారంభమయ్యాక సునీల్‌ నాయక్‌ చిన్నతనంగా భావించేవాడు. శరీరకంగా ఆరోగ్యంగా ఉన్నా తన మొఖంపై మచ్చలు ఉన్నాయంటూ ఆందోళనకు గురయ్యాడు. జనంలోకి వచ్చిన ప్రతిసారి మొఖంపై కర్చీఫ్ కప్పుకునే తిరిగేవాడు. ఎందరో వైద్యుల వద్దకు వెళ్లి మందులు వాడినా ఫలితం లేకపోయింది. కొద్ది రోజులుగా అందరూ తనను చులకనగా చూ స్తారని తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యేవాడని తల్లి పద్మనాయక్ తెలిపింది. చివరకు ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. అయితే, సోమవారం కరోనా పరీక్ష జరిపిన అనంతరం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us