Bigg Boss 4 Telugu: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ నాలుగో సీజన్ ప్రారంభమైపోయింది. గత సీజన్‌లలో కాస్త పేరు మోసిన వారు ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఈ సీజన్‌లో మాత్రం చాలామంది యూట్యూబర్లు, యాంకర్లు ఉన్నారు. దీంతో ఈ షో ‘సో.. సో’గా నడుస్తుంది. ఈ సీజన్ ప్రారంభమై నాలుగు రోజులే గడిచినప్పటికీ, బిగ్‌బాస్ 4 బోర్‌గా మారిందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కొంతమందేమో ఇంట్రస్ట్ మొత్తం పోయిందంటూ మీమ్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో షో రేటింగ్‌ని పెంచేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.
ఈ క్రమంలో మరో ముగ్గురిని హౌజ్‌లోకి రానున్నారట. వారిలో జబర్దస్త్ ముక్కు అవినాష్ లేదా కమెడియన్ సాయి కుమార్ ఉన్నట్లు తెలస్తోంది. ఆ ఇద్దరిలో ఒకరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి పంపనున్నట్లు సమాచారం. అలాగే గ్లామర్‌ని మరింత పెంచేందుకు హీరోయిన్ స్వాతి దీక్షిత్‌ని కూడా బిగ్‌బాస్ లోకి పంపబోతున్నట్లు టాక్. ఇక వీరికి ఇప్పటికే పరీక్షలు చేసి క్వారంటైన్‌లో ఉంచారని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? ఈ సీజన్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండబోతుందా..! వీటన్నింటిని సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.
Read More:
మహేష్‌ని సాయం కోరడం అలాంటిదే: సుధీర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు