YouTube: యూట్యూబ్ లో వీడియోలు చేసేవారికి శుభవార్త.. ఎకౌంట్ డిటైల్స్ మార్చకుండానే ఛానల్ పేరు మార్చుకోవచ్చు!

|

Apr 24, 2021 | 4:52 PM

యూట్యూబ్ లో వీడియోలు చేసేవారికి ఒక శుభవార్త. సాధారణంగా యూ ట్యూబ్ లో ఒక ఎకౌంట్ నుంచి చానల్ ప్రారంభించాకా అదే చానల్ అదే పేరుతో కొనసాగించాలి.

YouTube: యూట్యూబ్ లో వీడియోలు చేసేవారికి శుభవార్త.. ఎకౌంట్ డిటైల్స్ మార్చకుండానే ఛానల్ పేరు మార్చుకోవచ్చు!
You Tube
Follow us on

YouTube: యూట్యూబ్ లో వీడియోలు చేసేవారికి ఒక శుభవార్త. సాధారణంగా యూ ట్యూబ్ లో ఒక ఎకౌంట్ నుంచి చానల్ ప్రారంభించాకా అదే చానల్ అదే పేరుతో కొనసాగించాలి. మధ్యలో ఎపుదన్నా ఛానల్ పేరు మర్చుకోవలన్నా కుదరదు. కానీ, ఇప్పుడా నిబంధన మార్చింది గూగుల్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్. సరికొత్త అప్‌డేట్‌ తీసుకువచ్చింది. దీంతో వినియోగదారులు వారి అసలు గూగుల్ ఖాతాపై ప్రభావం చూపకుండా వారి ఛానెల్ పేరు అలాగే దాని ప్రొఫైల్ పిక్ మార్చడానికి అనుమతిస్తుంది. ఇప్పటి వరకు, యూట్యూబ్ సృష్టికర్తలు వారి ఛానల్ పేరు మార్చాలంటే మొత్తం తమ గూగుల్ ఎకౌంట్ మార్చాల్సి వచ్చేది. దీంతో వారు ఈ మెయిల్ చేయాలంట్ తమ యూట్యూబ్ ఛానల్ పేరు మీదే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఖాతా పేరు వేరుగా.. యూట్యూబ్ చానల్ పేరు వేరుగా ఉండేలా మార్పులు చేసుకునే అవకాశం కల్పిస్తోంది గూగుల్. క్రొత్త నవీకరణ వారి ఛానెల్ పేరుకు బదులుగా వారి అసలు పేరుతో ఇమెయిల్‌లను పంపడానికి ఇష్టపడే సృష్టికర్తలకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.

అయితే, ఇందులో ఓ చిక్కు ఉంది. దీనితో ఎకౌంట్ పేరు మార్చుకున్న వారికి ధృవీకరణ బ్యాడ్జ్ ఉన్న యుట్యూబ్ క్రియేటర్లు తమ బ్యాడ్జీని కోల్పోతారు. దీనికోసం మళ్ళీ క్రియేటర్లు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. యూట్యూబ్ క్రియేటర్ల అభ్యర్ధన మేరకు ఈ ఏర్పాటు చేసినట్టు యూట్యూబ్ ప్రకటించింది.

యూట్యూబ్ ద్వారా రోజు లక్షలాది వీడియోలను క్రిఎతర్స్ షేర్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ లో అన్ని విషయాలకు సంబంధించిన వీడియోలూ యూట్యూబ్ లో ఉంచుతారు. ఎవరైనా యుట్యూబ్ లో వీడియోలు ఉంచే అవకాశం ఉంటుంది. అయితే, దానికి గూగుల్ ఖాతా తప్పనిసరి. గూగుల్ ద్వారా యూట్యూబ్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. క్రియేటర్లు తమ గూగుల్ ఎకౌంట్ ద్వారా లాగిన్ అయిన తరువాత యూ ట్యూబ్ స్టూడియోలో తమ ఛానల్ పేరుతొ వీడియోలను ap లోడ్ చేయవచ్చు. అందులో ఉంచిన వీడియోలకు ప్రకటనల ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అయితే, దానికి యూట్యూబ్ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

Also Read: Art of a child: టీచర్ చిన్నబుచ్చింది.. అమ్మ ఆలోచించింది.. వాళ్ళు ప్రోత్సహించారు..ఆరేళ్ళ చిన్నారి అద్భుత పెయింటర్ అయింది!

Online shopping: అమ్మడి ఆన్లైన్ షాపింగ్..60 వేలతో ఏం కొనుక్కుందో చూస్తే నెటిజన్లు నవ్వుకుంటున్నట్టే మీరూ నవ్వుకుంటారు!