నరసాపురంలో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు: కేఏ పాల్

ఏలూరు: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాట్ హాట్‌గా సాగుతున్న ఏపీ రాజకీయాల్లోకి కేఏ పాల్ ప్రవేశించాక ప్రజలు కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ ఫీలయ్యారు. తన మార్కు విమర్శలతో టీడీపీ, వైసీపీలను చెడుగుడు ఆడుకున్న పాల్… తన విచిత్ర చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన తన పంథాను చాటుకున్నారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తలతో కలిసి ఫోటోలకు పోజులివ్వడం..వారి దగ్గరికి వెళ్లి ఓట్లు వెయ్యమని అభ్యర్థించడం లాంటి […]

నరసాపురంలో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు: కేఏ పాల్

Updated on: Apr 12, 2019 | 7:17 PM

ఏలూరు: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాట్ హాట్‌గా సాగుతున్న ఏపీ రాజకీయాల్లోకి కేఏ పాల్ ప్రవేశించాక ప్రజలు కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ ఫీలయ్యారు. తన మార్కు విమర్శలతో టీడీపీ, వైసీపీలను చెడుగుడు ఆడుకున్న పాల్… తన విచిత్ర చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన తన పంథాను చాటుకున్నారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తలతో కలిసి ఫోటోలకు పోజులివ్వడం..వారి దగ్గరికి వెళ్లి ఓట్లు వెయ్యమని అభ్యర్థించడం లాంటి సంఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆంధ్రాను అమెరికా చేయాలంటే తన  పార్టీని గెలిపించాలని పిలుపు ఇచ్చారు. ఇప్పటివరకు ప్రజాశాంతి పార్టీదే గెలుపని చెప్పిన ఆయన… ఇప్పుడు మాత్రం నరసాపురంలో తన ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి గెలుస్తారని చెబుతున్నారు. నరసాపురం లోక్‌సభ పరిధిలో 60 శాతం ఓట్లు తనకే పడ్డాయి కానీ… ఈవీఎంల్లో అవినీతి వల్ల వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని పాల్ జోస్యం చెప్పారు.  అవినీతిపై యుద్ధానికి యువత తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. వందలాది మంది యువత వస్తే దీక్ష చేపడతానని కేఏ పాల్ చెప్పారు.

Loading...
Unable to load recommendations.
Follow Us