పవన్‌ మానసిక పరిస్థితి బాలేదా.. ఇవేం వ్యాఖ్యలు: విజయసాయి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఓ రేంజ్‌లో.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు విసిరారు. ఒక పక్క దేశవ్యాప్తంగా.. దిశ ఘటనపై అందరూ నిరసనలు వ్యక్తం చేస్తుంటే.. పవన్‌కి ఏమో.. రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమా..? ఇదేనా పవనిజం.. అంటూ.. విజయసాయి ప్రశ్నించారు. ట్విట్టర్‌ వేదికగా పవన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రేపిస్టులకు ఉరిశిక్ష ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నాడంటే.. పవన్‌కు మానసికంగా.. ఏదో సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నట్టే. దేశమంతా కఠినంగా శిక్షించాలని […]

పవన్‌ మానసిక పరిస్థితి బాలేదా.. ఇవేం వ్యాఖ్యలు: విజయసాయి

Edited By:

Updated on: Dec 04, 2019 | 11:57 AM

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఓ రేంజ్‌లో.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు విసిరారు. ఒక పక్క దేశవ్యాప్తంగా.. దిశ ఘటనపై అందరూ నిరసనలు వ్యక్తం చేస్తుంటే.. పవన్‌కి ఏమో.. రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమా..? ఇదేనా పవనిజం.. అంటూ.. విజయసాయి ప్రశ్నించారు. ట్విట్టర్‌ వేదికగా పవన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

రేపిస్టులకు ఉరిశిక్ష ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నాడంటే.. పవన్‌కు మానసికంగా.. ఏదో సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నట్టే. దేశమంతా కఠినంగా శిక్షించాలని కళ్ల నీళ్లు పెట్టుకుంటుంటే.. ఈయనకు రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమై పోయాయి. పవనిజం అంటే ఇదేనేమో? రాజకీయ పార్టీ పెట్టింది ఇందుకేనా? అంటూ.. పవన్‌కి చురకలంటించారు విజయసాయి.

రాయలసీమ పర్యటనలో భాగంగా.. పవన్ కళ్యాణ్.. దిశ హత్యాచారం ఘటనపై స్పందించారు. ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ.. అందరూ చూస్తుండగా.. నిందితులను బెత్తం దెబ్బలతో శిక్షించాలని అన్నాడు. అప్పుడే తప్పు చేయాలన్న మరొకరి ఆలోచనలు మారుతాయని పవన్ పేర్కొన్నారు.. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎంపీ విజయ సాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.