కమలం తోటలో రాజుగారి హల్‌చల్.. చేరేదెప్పుడంటే?

| Edited By: Srinu

Dec 06, 2019 | 4:52 PM

రఘురామక‌ష్ణంరాజు.. ఈ పేరిప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో కాదు.. ఢిల్లీ రాజకీయాల్లో తెగ నానుతున్న పేరు. పది రోజుల క్రితం పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజున సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ‘‘ రాజుగారు.. హౌ ఆర్ యూ? ’’అని పలకరించడంతో రఘురామక‌ష్ణంరాజు జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ఆ గుర్తింపుని ఎన్‌క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు రఘురామక‌ష్ణంరాజు. తాజాగా రఘురామక‌ష్ణంరాజు హవా ఢిల్లీ పొలిటికల్ గల్లీల్లో మరీ ముఖ్యంగా మంత్రుల పేషీల్లో, మంత్రుల […]

కమలం తోటలో రాజుగారి హల్‌చల్.. చేరేదెప్పుడంటే?
Follow us on

రఘురామక‌ష్ణంరాజు.. ఈ పేరిప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో కాదు.. ఢిల్లీ రాజకీయాల్లో తెగ నానుతున్న పేరు. పది రోజుల క్రితం పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజున సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ‘‘ రాజుగారు.. హౌ ఆర్ యూ? ’’అని పలకరించడంతో రఘురామక‌ష్ణంరాజు జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ఆ గుర్తింపుని ఎన్‌క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు రఘురామక‌ష్ణంరాజు.

తాజాగా రఘురామక‌ష్ణంరాజు హవా ఢిల్లీ పొలిటికల్ గల్లీల్లో మరీ ముఖ్యంగా మంత్రుల పేషీల్లో, మంత్రుల నివాసాల్లోను జోరందుకున్నట్లు సమాచారం. మొన్నటి వరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఢిల్లీలో తెగ యాక్టివ్‌గా కనిపించేవారు. కానీ గత పదిహేను రోజులుగా ఆయన ప్రాభవం తగ్గి.. రఘురామక‌ష్ణంరాజు హవా ఊపందుకున్నట్లు సమాచారం.

ప్రధాన మంత్రి పలకరించిన మర్నాడే బిజెపి కేంద్ర కార్యాలయంలో దర్శనమయ్యారు రఘురామక‌ష్ణంరాజు. దాంతో వైసీపీ వర్గాలు ఉలిక్కి పడ్డాయి. ఇదేమని మీడియా అడిగితే.. ఢిల్లీలో తన అధికార నివాసం పని మీద వచ్చానన్నారు రఘురామక‌ష్ణంరాజు. ఎంపీలకు నివాస గృహాలను కేటాయించే పని నార్త్ బ్లాక్‌లోనో.. సౌత్ బ్లాక్‌లోనో జరుగుతుంది కానీ బిజెపి కేంద్ర కార్యాలయంతో దానికి సంబంధం ఏంటీ అంటే సదరు ఎంపీగారు.. మౌనవహించారట.

ఆ తర్వాత ఓ రోజు అమిత్ షాతో భేటీ అయ్యారు రఘురామక‌ష్ణంరాజు. ఆ మర్నాటి నుంచి కేంద్రమంత్రుల వద్దకు క్రమం తప్పకుండా వెళ్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమా లేక ఏదైనా వినతి పత్రం ఇచ్చారా అని మీడియా అడిగితే చిరునవ్వులు చిందిస్తున్నారు రఘురామక‌ష్ణంరాజు. ఈ భేటీలు తన వ్యక్తిగతమని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారాయన.

ఏపీకి చెందిన తూర్పు కాపు నేతలో కలిసి కేంద్ర మంత్రి ధావర్ చంద్ గెహాట్‌కూ రఘురామక‌ష్ణంరాజు భేటీ అయినట్లు సమాచారం. ఆ తర్వాత రోజు అంటే బుధవారం నాడు ఒకే రోజు అమిత్ షాతో రెండు సార్లు కలిశారని పత్రికలు రాశాయి. రఘురామక‌ష్ణంరాజు వ్యవహార శైలిపై పలువురు ఎంపీలు పార్టీ అధినేత జగన్‌కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే, జగన్ హెచ్చరికను కూడా రఘురామక‌ష్ణంరాజు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

ఇంకోవైపు బిజెపి నేతలు దీన్ని ఆసరాగా తీసుకుని రఘురామక‌ష్ణంరాజు త్వరలో బిజెపి తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు. ఇదివరకు కొన్నాళ్ళు బిజెపిలో వున్న రఘురామక‌ష్ణంరాజు మళ్ళీ ఆ పార్టీలోకే చేరడం ఖాయమని తెలుస్తోంది.