వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడికి పుత్ర వియోగం

| Edited By:

Aug 19, 2019 | 12:14 PM

మాజీ మంత్రి, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు కుమారుడు కొత్తపల్లి నారాయణ రాయుడు(35) అలియాస్ చంటిబాబు ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. సుబ్బారాయుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చంటిబాబుకి చిన్నప్పటి నుంచీ మానసిక ఎదుగుదల సరిగ్గా లేక. వీల్‌చైర్‌లోనే అన్ని సపర్యలు చేసేవారు. ఆదివారం సడన్‌గా చంటిబాబు వీల్‌చైర్‌లోనే కుప్పకూలాడు. దీంతో.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందాడని చెప్పడంతో.. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నారాయణ రాయుడు భౌతిక కాయాన్ని నర్సాపురం రుస్తుంబాదలోని సుబ్బారాయుడు స్వగృహానికి […]

వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడికి పుత్ర వియోగం
Follow us on

మాజీ మంత్రి, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు కుమారుడు కొత్తపల్లి నారాయణ రాయుడు(35) అలియాస్ చంటిబాబు ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. సుబ్బారాయుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చంటిబాబుకి చిన్నప్పటి నుంచీ మానసిక ఎదుగుదల సరిగ్గా లేక. వీల్‌చైర్‌లోనే అన్ని సపర్యలు చేసేవారు. ఆదివారం సడన్‌గా చంటిబాబు వీల్‌చైర్‌లోనే కుప్పకూలాడు. దీంతో.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందాడని చెప్పడంతో.. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

నారాయణ రాయుడు భౌతిక కాయాన్ని నర్సాపురం రుస్తుంబాదలోని సుబ్బారాయుడు స్వగృహానికి తరలించారు. నరసాపురంలోని అతనికి కర్మకాండ చేశారు. చంటిబాబు భౌతిక కాయాన్ని పలువురు నాయకులు, ప్రముఖులు, అధికారులతో పాటు స్థానిక ప్రజలు కూడ పెద్దఎత్తున తరలివచ్చి నివాళులు అర్పించారు. కాగా.. చంటిబాబు అంటే.. సుబ్బారాయుడికి అమితమైన ప్రేమ అని అందరూ చెబుతూంటారు.