
మంగళగిరి : వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధర్నాకు దిగారు. తాడేపల్లి పోలీస్‌స్టేషన్ వద్ద ఎమ్మెల్యే ఆర్కే ధర్నాకు దిగడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే.. తిరిగి తమ కార్యకర్తలపైనే కేసులుపెట్టారంటూ ఆరోపించారు. తాము చేసిన ఫిర్యాదులను కూడా పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. వైసీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆర్కే డిమాండ్ చేశారు.