Yanamala Comments On AP New Industrial Policy : నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రానికి పెద్దగా ఉపయోగం లేదని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన కొత్త ఇండస్ట్రీయల్ పాలసీలోని లోటుపాట్లను ఎత్తిచూపారు. దీనివల్ల భవిష్యత్ తరాలకు, ఉపాధి కల్పనకు పెద్దగా ఒరిగేదేమీ లేదని పేర్కొన్నారు. 14నెలల విలువైన కాలం వృధా చేసింది ఈ పాలసీ కోసమా ..? అని ప్రశ్నించారు. ఏపీ సర్కార్ చేసే పనుల వల్లే పారిశ్రామికరంగంలో మైనస్ 2.2% వృద్ధి సాధించారని విమర్శించారు. నిర్మాణ రంగం, తయారీ రంగం, రియల్ ఎస్టేట్ రంగాలన్నీ తిరోగమనంలోనే పయనిస్తున్నాయని పేర్కొన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన 14నెలల కాలంలో లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయి దిక్కులేనివారు అయ్యారని ఆరోపించారు. చివరికి గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా సగం శాలరీసే ఇస్తున్నారని మండిపడ్డారు. క్రెడిట్ రేటింగ్ పడిపోయి…ఇన్వెస్ట్‌మెంట్స్ అని వేరే రాష్ట్రాలకు తరలిపోయాయని పేర్కొన్నారు. ఏపీకి గతంలో ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను వైసీపీ లీడర్స్ నాశనం చేశారని ఎద్దేవా చేశారు. బలహీన వర్గాల వారు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే అవకాశాల్ని వైసీపీ సర్కార్ నీరుగార్చిందని, దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని యనమల హెచ్చరించారు.
Also Read : మలప్పురం ప్రజల మానవత్వానికి ఎయిర్ ఇండియా సలాం