WWW Teaser: ‘ఎవరు.. ఎక్కడ.. ఎందుకు’… ఆకట్టుకుంటోన్న ‘డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ’ టీజర్‌.. వీడియో కాల్‌ హ్యాక్‌ అయితే..

|

Jan 15, 2021 | 5:29 AM

WWW Teaser Out: పెరిగిన సాంకేతికతో ఎన్నో సేవలు అందుబాటులోకి వచ్చాయి. టెక్నాలజీలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ప్రపంచం అరచేతులోకి వచ్చేసింది. ఏ పని కావాలన్నా స్మార్ట్‌గా...

WWW Teaser: ఎవరు.. ఎక్కడ.. ఎందుకు... ఆకట్టుకుంటోన్న డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ టీజర్‌.. వీడియో కాల్‌ హ్యాక్‌ అయితే..
Follow us on

WWW Teaser Out: పెరిగిన సాంకేతికతో ఎన్నో సేవలు అందుబాటులోకి వచ్చాయి. టెక్నాలజీలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ప్రపంచం అరచేతులోకి వచ్చేసింది. ఏ పని కావాలన్నా స్మార్ట్‌గా చేస్తోన్న రోజులివీ. అయితే టెక్నాలజీకి మరో వైపు సైబర్‌ నేరస్థులు అనే ప్రమాదం కూడా పొంచి ఉంది. హ్యాకింగ్‌తో వ్యక్తిగత సమాచారం గాలిలో దీపంలో దీపంలా మారుతోంది. అచ్చంగా ఇలాంటి కథాంశంతోనే ఓ సినిమా రానుంది.
కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన ‘118’ చిత్ర దర్శకుడు కె.వి. గుహన్‌ డైరెక్షన్‌లో డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ (ఎవరు, ఎక్కడ, ఎందుకు) అనే సినిమా తెరకెక్కుతోంది. తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ఓ నలుగురు స్నేహితులు సరదాగా వీడియో కాల్‌ మాట్లాడుతుంటారు. ఈ సమయంలోనే వారి కాల్స్‌ను ఎవరో హ్యాక్‌ చేస్తారు. ఇక అక్కడి నుంచి ఆ నలుగురు వ్యక్తులకు కష్టాలు మొదలవుతాయి. అసలు ఆ హ్యాకింగ్‌ చేసింది ఎవరు, ఎక్కడి నుంచి చేశారు.. ఎందుకు చేశారనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు అర్థమవుతోంది. ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఈ టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి..

ఇక ఈ సినిమాలో అదిత్‌ అరుణ్‌, శివాని రాజశేఖర్‌ జంటగా నటించారు. ఈ సినిమాను డా.రవి, పి.రాజు దాట్ల నిర్మిస్తున్నారు. సిమన్‌ కె.కింగ్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Also Read: Psycho movie : సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ‘సైకో’.. ఆసక్తి కలిగిస్తున్న పోస్టర్స్