”కరోనా వ్యాక్సిన్.. మరో 20 ఏళ్ల పాటు అవసరం”

|

Oct 23, 2020 | 5:34 PM

ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ల అవసరం సుదీర్ఘ కాలం ఉంటుందని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా వెల్లడించారు. ప్రపంచ జనాభా అందరికీ కరోనా టీకా పంపిణీ పూర్తి చేసినప్పటికీ..

కరోనా వ్యాక్సిన్.. మరో 20 ఏళ్ల పాటు అవసరం
Follow us on

World Will Need Covid 19 Vaccines Till 20 Years: ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ల అవసరం సుదీర్ఘ కాలం ఉంటుందని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా వెల్లడించారు. ప్రపంచ జనాభా అందరికీ కరోనా టీకా పంపిణీ పూర్తి చేసినప్పటికీ.. భవిష్యత్తు తరాలకు కూడా ఈ టీకా ఉత్పత్తి ఎంతగానో అవసరమని.. అంటే మరో 20 ఏళ్ల పాటు కరోనా వ్యాక్సిన్ల అవసరం తప్పనిసరిగా ఉంటుందన్నారు. అయితే వ్యాక్సిన్ ఒక్కటే వ్యాధికి పరిష్కారం కాదన్న అదార్.. స్వీయ నియంత్రణ తప్పక పాటించాలని తెలిపారు.

వ్యాక్సిన్ మనలోని రోగనిరోధక శక్తిని పెంచి.. వ్యాధి తీవ్రతను మాత్రమే తగ్గిస్తుంది తప్పితే దాన్ని పూర్తిగా నిరోధించదని అదార్ అభిప్రాయపడ్డారు. ఇక ప్రస్తుతం కరోనా వైరస్‌ను నియంత్రించడంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న టీకాలు ఎంతకాలం రక్షణ కల్పించగలవో చెప్పలేమన్నారు. అందుకే కరోనా విషయంలో రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. కోవిడ్ 19 వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా కరోనాను నిర్మూలిస్తుందని అనుకోవద్దని.. ప్రపంచ జనాభా 100 శాతానికి టీకాలు పంపిణీ చేసినప్పటికీ.. భవిష్యత్తులో మరో 20 సంవత్సరాలు కరోనా వ్యాక్సిన్ అవసరం ఉంటుందని అదార్ పూనవల్లా చెప్పుకొచ్చారు.