
Working 8 hours a day overtime pay to be: రోజువారీ పనివేళలను 12 గంటలకు పెంచేందుకు అనుమతిస్తూ కేంద్ర కార్మిక శాఖ గత నవంబర్‌లో ముసాయిదా నిబంధనలను రూపొందించిన విషయం తెలిసిందే. ‘వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్’ (ఓఎస్‌హెచ్ కోడ్) కింద ఈ నిబంధనలను సిద్ధం చేసింది. ఇదే విషయమై రోజువారీ పనివేళలకు సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒకరోజులో 8 గంటలకు మించి, వారంలో 48 గంటలకు మించి పనిచేసినట్లయితే, ఆ అధిక పని సమయానికి సాధారణ జీతానికి రెట్టింపు జీతం ఇవ్వాలనే ప్రతిపాదనకు చట్టబద్ధత తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే అధికార ప్రకటన రావాల్సి ఉంది.
గతంలో ప్రతిపాదించిన ముసాయిదా నిబంధనల ప్రకారం.. ఒక రోజులో 8 గంటలకు మించి, వారంలో 48 గంటలకు మించి పనిచేసినట్లయితే, ఆ అధిక పని సమయానికి సాధారణ జీతానికి రెట్టింపు జీతం ఇవ్వాలని పేర్కొన్నారు. ఓవర్‌టైమ్ లెక్కింపు విషయానికొస్తే.. 15-30 నిమిషాల మధ్య అధిక సమయం పనిచేస్తే దానిని 30 నిమిషాలుగా, 30 నిమిషాల నుంచి ఒక గంట మధ్య ఉంటే దానిని ఒక గంట ఓవర్‌టైమ్‌గా పరిగణిస్తారు.