రాహుల్ గాంధీపై శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శల దాడి!

| Edited By:

Jun 03, 2019 | 9:50 PM

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురుకావడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపటి రోజు దేశం విడిచి వెళ్లిపోయినా ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదంటూ శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శివసేన అధికార పత్రిక సామ్నాలో వీక్లీ సంపాదకీయం రాసిన సంజయ్ రౌత్ రాహుల్ గాంధీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చాలా దూకుడుగా ఉన్నారని గుర్తు చేశారు. ఎన్నికల […]

రాహుల్ గాంధీపై శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శల దాడి!
Follow us on

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురుకావడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపటి రోజు దేశం విడిచి వెళ్లిపోయినా ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదంటూ శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శివసేన అధికార పత్రిక సామ్నాలో వీక్లీ సంపాదకీయం రాసిన సంజయ్ రౌత్ రాహుల్ గాంధీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చాలా దూకుడుగా ఉన్నారని గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి రాహుల్ గాంధీ మౌనంవహిస్తున్నారని, అజ్ఞాతంలో ఉంటున్నారని విమర్శించారు. ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా రాహుల్ రాజీనామా చేశారని చెప్పారు. రేపటి రోజు ఆయన విరక్తితో దేశం విడిచి వెళ్లిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు.

కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ పార్టీలో ఇంటిపోరు తీవ్రతరమైందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. పార్టీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటల కారణంగా ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయని సంజయ్ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో చాలా జిల్లాల్లో కాంగ్రెస్ కమిటీలను బీజేపీ, శివసేనలో విలీనం చేసేందుకు ముందుకు వస్తున్నారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.