మార్పు కోసం మహిళా మార్చ్

దేశానికి ప్రమాదంగా మారిన కుల, మతతత్వ విభజన శక్తులను ఓడించడానికి మహిళలందరూ ఏకమవ్వాలని మహిళా, ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. హింస, విద్వేషాలకు వ్యతిరేకంగా.. రాజ్యాంగ హక్కులను తిరిగి సాధించుకునేందుకు ఉద్యమించాలని కోరాయి. ఈ మేరకు మార్పు కోసం మహిళా మార్చ్‌ పేరిట దేశ వ్యాప్తంగా పలు మహిళా సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. మన భవిష్యత్తును నిర్ణయించడంలో ఓటు కీలకమైందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చాయి. గత ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగాయని మహిళా […]

మార్పు కోసం మహిళా మార్చ్

Edited By:

Updated on: Apr 05, 2019 | 9:53 PM

దేశానికి ప్రమాదంగా మారిన కుల, మతతత్వ విభజన శక్తులను ఓడించడానికి మహిళలందరూ ఏకమవ్వాలని మహిళా, ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. హింస, విద్వేషాలకు వ్యతిరేకంగా.. రాజ్యాంగ హక్కులను తిరిగి సాధించుకునేందుకు ఉద్యమించాలని కోరాయి. ఈ మేరకు మార్పు కోసం మహిళా మార్చ్‌ పేరిట దేశ వ్యాప్తంగా పలు మహిళా సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. మన భవిష్యత్తును నిర్ణయించడంలో ఓటు కీలకమైందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చాయి.

గత ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగాయని మహిళా సంఘాల నేతలు అన్నారు. మన ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుని ఉండి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగి ఉండేవి కావని వాపోయారు. ప్రస్తుతం దేశంలో ప్రశ్నించిన వారిని శిక్షిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఎన్నికల్లో మహిళల హక్కులను కాపాడేవారిని ఎన్నుకోవాలని అన్నారు. గురువారం దేశ వ్యాప్తంగా దాదాపు 20 రాష్ట్రాలలో ఉమెన్ మార్చ్ ఫర్ చేంజ్ పేరుతో భారీ కార్యక్రమాలు చేపట్టారు. దశాబ్దాలు గడుస్తున్నా, ప్రపంచం రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నా.. ఇంకా మహిళలు హింసకు బాధితులుగానే మిగిలిపోవాలా? మారాలి మారాలి మన సమాజమూ అంటూ మార్పు కోసం మహిళల మార్చ్ పేరుతో దాదాపు 40 మహిళా సంఘాలు హైదరాబాద్‌లో కూడా ర్యాలీ నిర్వహించాయి.