కుక్కను కాపాడలేదంటూ పశువైద్యురాలిపై దాడి

|

Apr 22, 2020 | 5:33 PM

ప్రేమతో పెంచుకున్న తమ కుక్కను కాపాడలేదంటూ ఓ పశు వైద్యురాలిపై దాడికి దిగిన ఉదంతం ప్రకాశం జిల్లాలో జరిగింది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో జరిగిన ఉదంతంలో పశువైద్యురాలు సాహితి స్వల్పంగా గాయపడ్డారు.

కుక్కను కాపాడలేదంటూ పశువైద్యురాలిపై దాడి
Follow us on

ప్రేమతో పెంచుకున్న తమ కుక్కను కాపాడలేదంటూ ఓ పశు వైద్యురాలిపై దాడికి దిగిన ఉదంతం ప్రకాశం జిల్లాలో జరిగింది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో జరిగిన ఉదంతంలో పశువైద్యురాలు సాహితి స్వల్పంగా గాయపడ్డారు.

ఒంగోలులో పశువుల డాక్టర్‌ సాహితీపై ఈతముక్కల గ్రామానికి చెందిన మహిళ బుధవారం ఉదయం దాడి చేశారు. తమ పెంపుడు కుక్కకు వైద్యం చేసిన డాక్టర్ సాహితి నిర్లక్ష్యం కారణంగా కుక్క చనిపోయిందని సదరు మహిళ ఆరోపించారు. పశు వైద్యురాలు సరిగా వైద్యం చేయకపోవడంతో తమ పెంపుడు కుక్క చనిపోయిందంటూ గొడవకు దిగిందా మహిళ. ఇలా ఆరోపిస్తూ ఆ మహిళ ఏకంగా పశువైద్యురాలిపై చేయి చేసుకుంది.

అక్కడే వున్న కొందరు సర్ది చెప్పినా ఆ మహిళ వినకపోగా.. పశువైద్యురాలిని దుర్భాష లాడారు. తనను తిడుతూ, దాడికి దిగిన మహిళపై పశువైద్యురాలు సాహితి ఫిర్యాదు మేరకు ఒంగోలు టూ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. కరోనాతో మనుషులకే గ్యారంటీ లేని పరిస్థితిలో కుక్క కోసం వైద్యురాలిని కొట్టడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.