అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ తను చేసిన పొరబాటుకు తానే బొక్క బోర్లా పడ్డాడు. ఈ ‘ మిస్టేక్ ‘ ఆయనను ఇబ్బందుల్లో పడేసింది. వివరాల్లోకి వెళ్తే.. నాసా మహిళా వ్యోమగాములు జెస్సికా మీర్, క్రిస్టినా కోచ్ అంతరిక్షంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బయట ‘ వాక్ ‘ చేశారు. (స్పేస్ వాక్).. ఈ సందర్భంగా లైవ్ కాల్ లో… వారిని అభినందిస్తూ ట్రంప్..’ మీరు తొలి మహిళా స్పేస్ వాకర్స్.. కంగ్రాట్స్ ‘ అన్నట్టుగా వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్ ఆయనకు, అంతరిక్ష కేంద్రానికి మధ్య కనెక్షన్ లో కాస్త డిలే అయి.. ఓ క్షణం పాటు నిశ్శబ్దం అలముకుంది. ట్రంప్ ‘ కంగ్రాట్స్ ‘ గురించి జెస్సికా మీర్ వినగానే .. తామిద్దరం మొట్టమొదటి స్పేస్ వాకర్స్ కాదని స్పష్టం చేసింది. అసలు 1984 లోనే శ్వేత్లనా అనే వ్యోమగామి తొలి వ్యోమగామి అయిందని వెల్లడించింది. ఈ 35 ఏళ్ళ కాలంలో మొత్తం 15 మంది మహిళా వ్యోమగాములు అంతరిక్షంలో నడిచినట్టు డైలీ ఎక్స్ ప్రెస్ ఈ సందర్భంగా గుర్తు చేసింది.
తాజాగా స్పేస్ వాక్ చేసిన వారిలో కోచ్.. ఎలక్ష్ట్రికల్ ఇంజనీరు కాగా.. మీర్… మెరైన్ బయాలజీ డాక్టరేట్ చేసింది. వీరు శుక్రవారం రాత్రి తమ నాసా స్పేస్ సూట్లు విడిచి బయటకు వచ్చారు. కాగా-తన కూతురు ఇవాంకా, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తోను, మరికొందరు నాసా అధికారులతోను వైట్ హౌస్ లో కూర్చుని ట్రంప్.. ఈ మహిళా వ్యోమగాములను అభినందించాడు. అక్కడే ‘ పప్పులో కాలేశాడు ‘. కెమెరా వైపు చూస్తూ. ‘ స్పేస్ స్టేషన్ బయట ఓ మహిళను చూడడం ఇదే మొదటిసారి.. ఇది అపూర్వం.. అద్భుతం.. వాళ్ళు కొంతవరకు కృషి చేశారు. అదికూడా చాలా ఎత్తయిన చోట.. అతి కొద్దిమందిని మాత్రమే ఇలా చూడగల్గుతాం ‘ అన్నాడాయన.. అయితే ఈ పొరబాటును మీర్ సరిచేస్తూ.. తామేమీ మొదటిసారి స్పేస్ వాక్ చేస్తున్న మహిళలం కాదని, తొలి మహిళా ఎస్ట్రోనట్స్ అన్న క్రెడిట్ సాధించాలనుకోవడం లేదని ‘ పేర్కొంది. అనేకమంది మహిళలు తమకన్నా ముందే ఇలా అంతరిక్షంలో నడిచారని ఆమె గుర్తు చేసింది. ‘ ఒకే సమయంలో ఇద్దరు మహిళలు స్పేస్ స్టేషన్ బయట గడపడం మాత్రం ఇదే మొదటిసారి ‘ అని ఆమె వ్యాఖ్యానించింది.
వాల్డ్ లోనే అతి ధనిక దేశంగా పేరు పొంది.. , నాసా వంటి అత్యద్భుత శాస్త్రీయ సాంకేతిక, అంతరిక్ష పరిశోధనా సంస్థలున్నఅమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ కు.. ఏ మహిళా వ్యోమగాములు స్పేస్ వాక్ చేస్తున్నారో, వారి పేర్లేమిటో కూడా తెలియకపోవడం.. .గతంలోనే కొందరు మహిళలు ఇలాంటి అద్భుతాన్ని సాధించారన్న విషయంలో కనీస పరిజ్ఞానం లేకపోవడం విడ్డూరం.