బీహార్‌లో వరద భీభత్సం.. 21మంది మృతి..!

| Edited By:

Aug 07, 2020 | 4:28 PM

నేపాల్‌లోని‌ నదుల నుంచి బిహార్‌కు వరదనీరు పోటెత్తడంతో రాష్ట్రంలోని 16 జిల్లాలు జలమయమయ్యాయి. ఈ వరదలకు 21 మంది మృతి చెందగా, 69లక్షల మందిపై ప్రభావం చూపాయి. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన

బీహార్‌లో వరద భీభత్సం.. 21మంది మృతి..!
Follow us on

నేపాల్‌లోని‌ నదుల నుంచి బిహార్‌కు వరదనీరు పోటెత్తడంతో రాష్ట్రంలోని 16 జిల్లాలు జలమయమయ్యాయి. ఈ వరదలకు 21 మంది మృతి చెందగా, 69లక్షల మందిపై ప్రభావం చూపాయి. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 33 బృందాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపడుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. బీహార్‌ ప్రభుత్వం గురువారం గణాంకాల ప్రకారం.. పలు జిల్లాల్లో ఎనిమిది సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. 1,402 కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేశారు.

ఇప్పటివరకు వరదలకు 4.82 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వీరిలో 12,239 మంది సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. రాష్ట్రంలోని ఖగారియా, సహర్సా, దర్భాంగా జిల్లాల్లో పడవ బోల్తా పడిన మూడు వేర్వేరు సంఘటనల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోగా సీఎం నితీశ్‌కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలపై బుధవారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

Read More:

జగన్ కీలక నిర్ణయం.. బీటెక్‌ కోర్సుల్లో అప్రెంటిస్‌షిప్‌, ఆనర్స్‌ డిగ్రీ..!

ఇక ప్రతి నియోజకవర్గానికి కరోనా టెస్టింగ్‌ మొబైల్‌ లేబొరేటరీ..!