వన్డే సూపర్ లీగ్.. ఇంగ్లాండ్ లక్ష్యం 173..

కరోనా విరామం తర్వాత వన్డే మ్యాచ్‌లు మొదలయ్యాయి. వన్డే సూపర్ లీగ్‌లో భాగంగా ఇంగ్లాండ్, ఐర్లాండ్ జట్లు ఇవాళ సౌతాంప్టన్ వేదికగా తలబడుతున్నాయి

వన్డే సూపర్ లీగ్.. ఇంగ్లాండ్ లక్ష్యం 173..

Updated on: Jul 30, 2020 | 10:23 PM

Willey Takes Five: కరోనా విరామం తర్వాత వన్డే మ్యాచ్‌లు మొదలయ్యాయి. వన్డే సూపర్ లీగ్‌లో భాగంగా ఇంగ్లాండ్, ఐర్లాండ్ జట్లు ఇవాళ సౌతాంప్టన్ వేదికగా తలబడుతున్నాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లీష్ జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఐర్లాండ్‌ను 172 ఆలౌట్ చేసింది. ఐర్లాండ్ ఆటగాళ్లలో కర్టిస్ కాంపర్(59) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ సాధించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ 5 వికెట్లు తీసి ప్రత్యర్ధులను భయపెట్టాడు. అలాగే సాకిబ్ మహమూద్ రెండు వికెట్లు, ఆదిల్ రషీద్, టామ్ కుర్రాన్‌లు చెరో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే 173 పరుగులు చేయాల్సి ఉంది. భారీ బ్యాటింగ్ లైనప్ ఉండటంతో ఇంగ్లీష్ జట్టు అలవోకగా విజయం అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.