AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరల్డ్ టూరిజం డే : ప్రపంచం అర్ధం కావాలంటే.. పర్యటించాల్సిందే..

ఎప్పుడూ ఒకే చోట ఉండిపోవడం అనేది జీవితానికి ఎలాంటి అనుభూతిని అందించలేదు. నాలుగు ప్రదేశాలు తిరగాలి.. నాలుగు చోట్ల ఏం జరుగుతుందో.. అక్కడ ప్రజల జీవనశైలి ఎలా ఉంటుందో చూడాలి అలాగే ఆయా ప్రదేశాల ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలి. అప్పుడే మనిషికి కాస్తలో కాస్తయినా మార్పు వస్తుంది. మన చుట్టూ ఎన్నో ప్రదేశాలున్నాయి. ఒక్కోసారి వాటిని పుట్టి బుద్దెరిగినప్పటినుంచి వినడం తప్ప కంటితో కూడా చూసే అవకాశం రాదు. అయితే అలాంటి ప్రదేశాలకు ఒక్కసారైన వెళ్లి వస్తే […]

వరల్డ్ టూరిజం డే :  ప్రపంచం అర్ధం కావాలంటే.. పర్యటించాల్సిందే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 31, 2020 | 12:31 AM

Share

ఎప్పుడూ ఒకే చోట ఉండిపోవడం అనేది జీవితానికి ఎలాంటి అనుభూతిని అందించలేదు. నాలుగు ప్రదేశాలు తిరగాలి.. నాలుగు చోట్ల ఏం జరుగుతుందో.. అక్కడ ప్రజల జీవనశైలి ఎలా ఉంటుందో చూడాలి అలాగే ఆయా ప్రదేశాల ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలి. అప్పుడే మనిషికి కాస్తలో కాస్తయినా మార్పు వస్తుంది. మన చుట్టూ ఎన్నో ప్రదేశాలున్నాయి. ఒక్కోసారి వాటిని పుట్టి బుద్దెరిగినప్పటినుంచి వినడం తప్ప కంటితో కూడా చూసే అవకాశం రాదు. అయితే అలాంటి ప్రదేశాలకు ఒక్కసారైన వెళ్లి వస్తే మనసు ఎంతో పరవశిస్తుంది. మనకు ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నాయి. వీటిని చూడటానికి ప్రస్తుతం ఎన్నో మార్గాలు కూడా ఉన్నాయి. ప్రకృతిలో మమేమకమైన ఎన్నో ప్రాంతాలను ఈ జీవితంలో ఒక్కసారైన కళ్లారా చూసి తనివితీరా అక్కడి సంగతులను మనసుకు హత్తుకుంటే ఎన్నో మధురానుభూతులు మనకు సొంతం కాకమానవు.

సెప్టెంబర్ 27 అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం. 1970 ప్రాంతంలో యుఎన్‌డబ్ల్యుటిఓ(UNWTO) శిల్పాల పరిరక్షణ బాధ్యతను చేపట్టారు. గ్లోబల్ టూరిజంలో సువర్ణాక్షరాలతో లిఖించిన రోజది. ఆ తర్వాత 1980లో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్ 27న జరపాలని నిర్ణయించారు. అప్పట్నుంచీ – ఒక్కో సంవత్సరం ఒక్కో కాన్సప్ట్‌తో నిర్వహిస్తున్నారు. 1980లో – ‘టూరిజం కంట్రిబ్యూషన్ టు ది ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ టు పీస్ అండ్ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అని పేరు పెట్టారు. ఇలా ప్రతి ఏడాది ఒక్కో అంశాన్ని తీసుకుని టూరిజం పట్ల పర్యాటకుల్లో ఆసక్తిని కలిగించడమే కాకుండా ఆయా చారిత్రక విషయాలను పదిలపరచుకోడానికి ఒక అవకాశంగా తీసుకుంటున్నారు.

why world tourism day is celebrated, here are some tourist places in india

పర్యాటకులను ఆకర్షించడానికి మన ప్రభుత్వాలు పర్యాటక శాఖను కూడా నిర్వహిస్తోంది. ఈ శాఖ జాతీయ స్ధాయిలోనూ, రాష్ట్ర స్ధాయిల్లో కూడా పర్యాటకాన్ని పెంపొందించేలా కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా మనదేశంలో ఎన్నో బౌద్ధ ఆరామాలు, మొగల్ చక్రవర్తులు, రాజపుత్ర వంశీయుల చారిత్రక సంపద, లెక్కలేనన్ని హిందూ దేవాలయాలు, నదులు, కొండలు, గుట్టలు, అడవులు, సముద్ర తీరాలు ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో చారిత్రక ఆనవాళ్లకు ప్రసిద్ధిగా నిలిచింది. ఇప్పటికీ అజంతా,ఎల్లోరా గుహలు ఎంతో ప్రసిద్ధి. అలాగే రాజస్ధాన్ థార్ ఎడారి, తాజ్ మహల్, ఢిల్లీ గేట్, గేట్ వే ఆఫ్ ఇండియా (ముంబై) ,‌విశాఖపట్టణం ఆర్కే బీచ్, గోదావరి అందాలు, కృష్ణమ్మ హొయలు, అరకు లోయ, బొర్రా గుహలు, హార్సిలీ హిల్స్, మహానంది, బ్రహ్మంగారి మఠం, హైదరాబాద్‌లో గల చార్మినార్, గోల్కొండ కోట, హుస్సేన్ సాగర్, అసెంబ్లీ హాలు, జూబ్లీహాలు, ఎన్టీఆర్ గార్డెన్, ఇవన్నీ పర్యాటక ప్రదేశాలే. ఇక పుణ్యక్షేత్రాల విషయానికి వస్తే అష్టాదశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ కూడా పర్యాటక ప్రాంతాలే. ఇవ్నీ ఒక ఎత్తయితే గోవాలాంటి బీచ్‌లు కూడ యువతను ఆకర్షిస్తూ ఉంటాయి.

why world tourism day is celebrated, here are some tourist places in india

మన ప్రభుత్వాలు టూరిజం అభివృద్ధి కోసం ఎన్నో ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రత్యేకించి విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఎన్నోరకాలుగా ఆహ్వానం పలుకుతోంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ఆయా రాష్ట్రాల సంస్ధలు కూడా పర్యాటకంపై ప్రత్యేక దృష్టిని సారించాయి. అయితే ఒకదేశానికి సంబంధించిన ఎన్నో చారిత్రక విశేషాలను మరో దేశానికి చెందిన వారు స్వేచ్ఛగా వచ్చి చూసేలా వారికి ఎన్నో విధాలుగా మన ప్రభుత్వాలు సేవలందిస్తున్నాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్ధం చేసుకోవాలంటే పర్యాటకం ఒక్కటే మార్గం అనే మాట బహళ ప్రాచుర్యం పొందింది. దీన్నిబట్టి కనీసం ఈసారైనా మీ చుట్టూ ఉన్న ప్రదేశాలను ఒక్కసారైనా కుటుంబ సమేతంగా చూసి ఆస్వాదిస్తే.. అందులో కలిగే అనందం జీవితాంతం గుర్తుండిపోయే తీపి ఙ్ఞాపకంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.