బల్లిని చూస్తే గుండె దడదడలాడుతోందా?.. ఇది భయమా? ఫోబియానా? నిపుణులు చెప్పిన షాకింగ్ నిజాలు!
ఇంట్లో గోడపై బల్లి కనిపించగానే కొందరు ప్రశాంతంగా తమ పని చేసుకుంటారు. కానీ మరికొందరికి మాత్రం అది ఒక భయానక అనుభవంగా మారుతుంది. బల్లిని చూడగానే గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, వణుకు రావడం, ఆ ప్రదేశాన్ని వదిలి పారిపోవాలనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది కేవలం సాధారణ భయం మాత్రమే కాకుండా కొన్నిసార్లు ఫోబియాగా మారవచ్చు అంటున్నారు నిపుణులు.

బల్లిని చూడగానే తనకు తీవ్ర ఆందోళన, గుండె దడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయని కొందరు చెబుతున్నారు. అలాగే మరికొందరు బల్లిని చూసినప్పుడు తన శరీరం, మనసు రెండూ తీవ్ర భయానికి గురవుతాయని వెల్లడించారు. బాత్రూమ్‌లోకి వెళ్లే ముందు ప్రతి మూలను పరిశీలించడం తమకు అలవాటైందని చెబుతున్నారు.
మనోవైద్యుల ప్రకారం, భయం అనేది కేవలం బల్లి వల్ల మాత్రమే కాదు. దాని రూపం, వేగంగా కదలడం, ఎప్పుడు ఎక్కడ కనిపిస్తుందో తెలియకపోవడం వంటి అంశాలు మెదడులో ప్రమాద సంకేతాలను ప్రేరేపిస్తాయి. ముఖ్యంగా చిన్ననాటి అనుభవాలు, కుటుంబ సభ్యుల ప్రవర్తన, సామాజిక ప్రభావాలు కూడా ఈ భయాన్ని పెంచుతాయి. తల్లిదండ్రులు బల్లిని చూసి కేకలు వేయడం లేదా భయపడటం చూసి పెరిగిన పిల్లలు కూడా అదే భయాన్ని అలవర్చుకునే అవకాశం ఉంటుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, బల్లులంటే ఇష్టం లేకపోవడం సాధారణమే. అయితే ఆ భయం రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తే అది ఫోబియాగా పరిగణించవచ్చంటున్నారు. ఉదాహరణకు, బల్లి కనిపిస్తుందనే భయంతో కొన్ని గదుల్లోకి వెళ్లకపోవడం, ఇంట్లో ఒంటరిగా ఉండటానికి భయపడటం, పదేపదే గోడలు, పైకప్పులను తనిఖీ చేయడం వంటి లక్షణాలు కనిపిస్తే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం అవసరం.
అయితే ఈ ఫోబియాకు చికిత్స ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT), గ్రాడ్యువల్ ఎక్స్‌పోజర్ థెరపీ వంటి పద్ధతుల ద్వారా బల్లుల పట్ల ఉన్న భయాన్ని క్రమంగా తగ్గించవచ్చు. సరైన మార్గదర్శకత్వం, సహనం ఉంటే సంవత్సరాలుగా వెంటాడుతున్న ఈ భయాన్ని కూడా అధిగమించడం సాధ్యమేనని వైద్యులు సూచిస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..