ప్లాస్మాకీ ఓ లెక్కుంది..! ఎవరు దానం చేయొచ్చు? ఎవరు అనర్హులు?

| Edited By:

Jul 18, 2020 | 7:13 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనే దిశగా చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే కరోనాను జయించినవారు

ప్లాస్మాకీ ఓ లెక్కుంది..! ఎవరు దానం చేయొచ్చు? ఎవరు అనర్హులు?
Follow us on

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనే దిశగా చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే కరోనాను జయించినవారు ప్లాస్మా దానం చేయాలని వైద్యులు పిలుపునిస్తున్నారు. కానీ.. కరోనాపై పోరులో భాగంగా మన రోగనిరోధక వ్యవస్థ విడుదల చేసే యాంటీబాడీలు ఎక్కువకాలం ఉండవని, వైరస్‌ బారిన పడి కోలుకున్న కొన్ని నెలల తర్వాత తగినన్ని యాంటీబాడీలు శరీరంలో ఉండట్లేదని లండన్‌లోని కింగ్స్‌ కాలేజీ శాస్త్రజ్ఞుల అధ్యయనంలో తేలింది. దీంతో, సాధారణ జలుబులాగానే కొవిడ్‌-19 కూడా మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

ప్లాస్మా దానానికి.. 18 నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్నవారు, 50 కిలోలకు పైగా బరువున్న కరోనా విజేతలే ప్లాస్మాదానానికి అర్హులు. అది కూడా.. వైరస్‌ నుంచి కోలుకున్న 14 రోజుల తర్వాతే ప్లాస్మాను దానం చేయాలి. 50 కిలోల కన్నా తక్కువ బరువున్నవారు, ఇన్సులిన్‌ వాడుతున్న మధుమేహ బాధితులు, రక్తపోటు 140 కన్నా ఎక్కువ ఉన్న వారు, డయాస్టోలిక్‌ ప్రెజర్‌ 60కన్నా తక్కువ- 90కన్నా ఎక్కువ ఉన్నవారు, కేన్సర్‌ బారిన పడి కోలుకున్నవారు, మూత్రపిండ, కాలేయ, ఊపిరితిత్తులు, హృద్రోగాలతో బాధపడుతున్నవారు ప్లాస్మాదానానికి అనర్హులు.