నేడే ప్రజాతీర్పు.. గెలిచేదెవరు..?
41 రోజుల టెన్షన్‌కు నేటితో తెరపడనుంది. మరికొంతసేపట్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. దీంతో అందరిలోనూ ఉత్కంఠ పెరిగిపోతుంది. చిన్న,పెద్ద లేకుండా ప్రతి ఒక్కరు టీవీలు, సోషల్ మీడియాలకు అతుక్కుపోయారు. ఈ ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను తరువాత సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. 8.30గంటల నుంచి ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఇక రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,118 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అలాగే […]
41 రోజుల టెన్షన్‌కు నేటితో తెరపడనుంది. మరికొంతసేపట్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. దీంతో అందరిలోనూ ఉత్కంఠ పెరిగిపోతుంది. చిన్న,పెద్ద లేకుండా ప్రతి ఒక్కరు టీవీలు, సోషల్ మీడియాలకు అతుక్కుపోయారు.
ఈ ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను తరువాత సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. 8.30గంటల నుంచి ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.
ఇక రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,118 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అలాగే 25 ఎంపీ సీట్లకు 319 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఈ మధ్యాహ్నం 12 గంటల కల్లా ఫలితాల సరళి వెల్లడి కావడంతో ఏ పార్టీ అధికారం దక్కించుకుంటుందో స్పష్టం కానుంది.