జార్ఖండ్‌లో బిజెపి ఓటమికి పౌరసత్వ సవరణ చట్టం కారణమని ప్రతిపక్ష రాజకీయ నాయకులు – శరద్ పవార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా విస్తృతంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో “నరేంద్ర మోదీ ముగింపు ప్రారంభం” అని కూడా చాలామంది తెలిపారు. లోక్‌సభ డిసెంబర్ 9 న పౌరసత్వం (సవరణ) బిల్లును ఆమోదించింది. జార్ఖండ్ ఎన్నికలకు రెండు దశల ఎన్నికలు అప్పటికి పూర్తయ్యాయి. ఆ తరువాత మూడు దశలు జరిగాయి. అయితే.. జార్ఖండ్‌లో తన ప్రచారంలో హోంమంత్రి అమిత్ షా సిఎఎను ఒక భాగంగా చేసుకున్నారని గుర్తుంచుకోవాలి.
అందువల్ల, పౌరసత్వ సవరణ బిల్లు రాకముందు, తరువాత కూడా బిజెపి ఓట్లను కోల్పోయింది. స్పష్టమైన విషయం ఏమిటంటే, సవరించిన పౌరసత్వ చట్టం బీజేపీ, జెఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ.. ఏ పార్టీపై ప్రభావం చూపలేదు. బిజెపి అగ్ర నాయకులు తమ ప్రచార వాక్చాతుర్యాన్ని ఉపయోగించి సిఎఎను వెయ్యి శాతం సరైనది’ అని సమర్థిస్తూ ఎన్నికల వేళ ప్రస్తావించినట్లు నివేదికలు ఉన్నాయి. అయితే.. “సీఏఏ, ఎన్నార్సీలను ఓటు వేసిన విధానాన్ని ప్రభావితం చేసే కారకంగా ప్రతివాదులు చాలా అరుదుగా పేర్కొన్నారు. అధిక శాతం మంది నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, అభివృద్ధి మరియు పాలన వంటి అంశాలను తమ ఓటును నిర్ణయించే ప్రధాన సమస్యలుగా తెలిపారు.
రఘుబర్ దాస్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో జనాదరణ పొందకపోవడమే జార్ఖండ్ ఓటమికి కారణమని సమాచారం. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ప్రధాని మోదీకి కూడా ఆదరణ తగ్గినట్లు తెలుస్తోంది.