AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదివారం మటన్ తింటున్నారా? ఏ భాగంలో కొవ్వు, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి? ఆరోగ్యానికి బెస్ట్ ముక్కలు ఇవే!

ఆదివారం వచ్చిందంటే చాలు చాలామంది ఇళ్లల్లో మటన్ ఘుమఘుమలాడాల్సిందే. మటన్‌లో అధిక ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ బి12 వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, మటన్ తినేటప్పుడు మనం ఏ భాగాన్ని (Cut) తింటున్నాం అనేది మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. మటన్‌లోని అన్ని ముక్కల్లో ఒకే రకమైన కొవ్వు ఉండదు. జంతువు శరీరంలో కదలికలు తక్కువగా ఉండే భాగాలలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. వాటి గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం:

Jyothi Gadda
|

Updated on: Jul 02, 2026 | 9:06 AM

Share
మటన్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దానిలోని కొన్ని భాగాలలో కొవ్వు (ఫ్యాట్), క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. మటన్‌లోని అన్ని ముక్కల్లో ఒకే రకమైన కొవ్వు ఉండదు. జంతువు శరీరంలో కదలికలు తక్కువగా ఉండే భాగాలలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది.

1 / 5
మటన్ చాప్స్ తినడానికి చాలా రుచిగా ఉంటాయి. కానీ, వీటిలో మ్యాబ్లింగ్ ఫ్యాట్ మాంసం లోపల ఉండే కొవ్వు, క్యాలరీలు చాలా ఎక్కువ. అలాగే, మటన్‌ దస్తీ, భుజం, సీనా, ఛాతి భాగాల ముక్కలు బిర్యానీ, కర్రీల్లో జ్యూసీగా ఉంటాయి.. ఎందుకంటే వీటిలో సహజంగానే కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ రోజువారీ క్యాలరీల బడ్జెట్‌ను దాటించేస్తుంది. ఈ కొవ్వు భాగాలను తరచూ లేదా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని కలగవచ్చు.

2 / 5
మటన్‌లోని సంతృప్త కొవ్వులు (Saturated Fats) రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను పెంచుతాయి. ఇది ధమనులలో అడ్డంకులు ఏర్పరిచి గుండెపోటుకు దారితీస్తుంది. 100 గ్రాముల ఫ్యాటీ మటన్ ముక్కల ద్వారా శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయి. దీనివల్ల ఊబకాయం, పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంది. అధిక కొవ్వు గల రెడ్ మీట్ క్రమం తప్పకుండా తింటే ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

3 / 5
రోజుకు ఎంత తినాలి? కొనుగోలు చిట్కాలు: బరువు అదుపులో ఉంచుకోవాలనుకునే వారు లేదా సాధారణ ఆరోగ్యవంతులు రోజుకు 100 నుండి 150 గ్రాముల మటన్ ముక్కలను మాత్రమే తీసుకోవాలి. వారంలో రెండు సార్ల కంటే ఎక్కువ రెడ్ మీట్ తినకపోవడం మంచిది. మటన్ కొనేటప్పుడు వెనుక కాళ్ల భాగం (Raan లేదా Shank) ముక్కలను అడగండి. వీటిలో కొవ్వు చాలా తక్కువగా ఉండి, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.

4 / 5
మాంసం కొనేటప్పుడే, ముక్కలపై విడిగా కనిపించే తెల్లటి కొవ్వును (Visible Fat) పూర్తిగా కత్తిరించి తీసేయమని (Trim) చెప్పండి. ఎక్కువ నూనె లేదా నెయ్యి వేసి వేపడం (Deep Fry) కంటే.. ప్రెషర్ కుక్కర్‌లో తక్కువ ఆయిల్, టొమాటో-ఉల్లిపాయ గ్రేవీతో వండుకోవడం ఎంతో ఆరోగ్యకరం.

5 / 5
Follow Us
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు ప్రభుత్వం తెలిపిన 8 అభ్యంతరాలు ఇవే

కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు!

నోట్లో కరిగిపోయే కమ్మనైన పేదోళ్ల పచ్చి కొబ్బరి పాయసం..

క్రికెట్ వేలంలో కోహ్లీ మేనల్లుడి జోరు
క్రికెట్ వేలంలో కోహ్లీ మేనల్లుడి జోరు
నా సినిమా చూసి మహేష్ అన్న అర్ధరాత్రి కాల్ చేశారు..

ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా..? కానీ, ఈ ఒక్క పనిచేస్తే బిందాస్

రోజుకు 2 నిమిషాలు ఒంటి కాలిపై నిలబడి బ్రష్ చేయండి..! లాభాలు ఇవే

నిందితుడి భార్య ఖాతా చూసి పోలీసుల మైండ్ బ్లాక్..!

పీఎఫ్‌ లబ్థిదారులకు బిగ్ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఇకపై

ఇదేం సినిమా పిచ్చిగా ఉందన్నారు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్.. ఇప్