పాక్ మంత్రి నోటి దురుసు, విపక్షాల ‘రియల్ ఫేసు’ ఒకటే ! ప్రధాని మోదీ

పుల్వామా దాడిపై పాకిస్తాన్ పార్లమెంటులో ఆ దేశ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాల అసలు రూపాన్ని బయటపెట్టాయని ప్రధాని మోదీ అన్నారు. పుల్వామా ఉదంతాన్ని విపక్షాలు తమ స్వార్థపర రాజకీయాల

పాక్ మంత్రి నోటి దురుసు, విపక్షాల రియల్ ఫేసు ఒకటే ! ప్రధాని మోదీ

Edited By:

Updated on: Oct 31, 2020 | 2:07 PM

పుల్వామా దాడిపై పాకిస్తాన్ పార్లమెంటులో ఆ దేశ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాల అసలు రూపాన్ని బయటపెట్టాయని ప్రధాని మోదీ అన్నారు. పుల్వామా ఉదంతాన్ని విపక్షాలు తమ స్వార్థపర రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా దాడిలో 40 మంది భారత జవానులు అమరులయ్యారని, వారి మృతికి దేశం కన్నీటి నివాళులర్పిస్తోందని మోదీ పేర్కొన్నారు. సర్దార్ వల్లభ భాయ్ పటేల్ 145 వ జయంతిని పురస్కరించుకుని శనివారం గుజరాత్ లోని కెవాడియా లో ఆయన నిలువెత్తు విగ్రహం వద్ద మోదీ  ఘనంగా నివాళులు అర్పించారు. పుల్వామా ఎటాక్ ఫై ఆ దేశ అసలు రంగు ఆ దేశమంత్రి వ్యాఖ్యలతో నిరూపితమైందని ఆయన అన్నారు. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారనడానికి ఆ కామెంట్లే ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా-ఈ దాడికి కారణమెవరని, భద్రతా లోపాలకు కారణం బీజేపీయేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించిన విషయం గమనార్హం. ఈ వ్యాఖ్యలను మోదీ గుర్తు చేస్తూ,  ఈ విధమైన ఘటనలకు ఎంతసేపూ తమ పార్టీయేనని కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోందని, అయితే స్వార్థపర రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుందని అన్నారు.  పాక్  మంత్రి ఫాద్  చౌదరి ఇటీవల తమ దేశ పార్లమెంటులో వివాదాస్పద వ్యాఖ్యాలు చేసిన సంగతి తెలిసిందే. ..ఇండియాలో చొరబడి తాము  దాడి చేశామని, తమదే విజయమని అయన అన్నారు.