వావ్ వాటే టెక్నాలజీ.. వాట్సాప్‌లో ఒకేసారి 50 మందితో వీడియో కాల్!

| Edited By: Pardhasaradhi Peri

May 12, 2020 | 5:09 PM

వాట్సాప్‌లో మరో సరికొత్త టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పటివరకూ మనం వీడియో కాల్.. నలుగురితో మాట్లాడాం. అలాగే దాన్ని అప్‌డేట్ చేస్తూ.. ఎనిమిది మందితో మాట్లాడే సౌకర్యాన్ని తీసుకొస్తున్నట్లు ఇటీవలే వాట్సాప్ సంస్థ తెలిపింది. అయితే ఇప్పుడు ఏకంగా ఒకే సారి 50 మందితో..

వావ్ వాటే టెక్నాలజీ.. వాట్సాప్‌లో ఒకేసారి 50 మందితో వీడియో కాల్!
Follow us on

వాట్సాప్‌లో మరో సరికొత్త టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పటివరకూ మనం వీడియో కాల్.. నలుగురితో మాట్లాడాం. అలాగే దాన్ని అప్‌డేట్ చేస్తూ.. ఎనిమిది మందితో మాట్లాడే సౌకర్యాన్ని తీసుకొస్తున్నట్లు ఇటీవలే వాట్సాప్ సంస్థ తెలిపింది. అయితే ఇప్పుడు ఏకంగా ఒకే సారి 50 మందితో వీడియో కాల్‌ మాట్లాడొచ్చు. ఈ న్యూస్ విని షాక్ అయ్యారా! అవును ఇది నిజమే.. త్వరలోనే ఈ టెక్నాలజీ మనకు అందుబాటులోకి రానుంది.

జూమ్ వంటి దిగ్గజ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌లను తలదన్నేలా.. ఫేస్ బుక్ తీసుకొచ్చి ‘మెసెంజర్ రూమ్స్’ త్వరలో వాట్సాప్ వెబ్‌లో కనిపించింది. అవును ఇక మీ ల్యాప్‌టాప్‌లు, పీసీల్లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేస్తే.. ‘ఫైల్ అటాచ్ బటన్’ కింద ఈ ‘మెసెంజర్ రూమ్స్’ షార్ట్‌కట్ అందుబాటులోకి రానుంది.

ఈ మెసెంజర్ రూమ్స్‌లో ఒకేసారి 50 మందితో మాట్లాడే సౌకర్యం ఉంటుంది. అయితే ఈ మెసెంజర్ రూమ్స్ కోసం ప్రత్యేకంగా ఫేస్‌బుక్ లాగిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో కనిపించేలా ఎఫ్‌బీ ఏర్పాటు చేస్తోంది . దీంతో వాట్సాప్ నుంచే మెసెంజర్ రూమ్స్ ద్వారా 50 మందితో వీడియోకాల్ మాట్లొడొచ్చు. కాగా ఇది జూన్ 2 నుంచి అందుబాటులోకి రానుందని అధికారి నివేదిక ప్రకారం తెలిసింది.

ఇందులో ఎలా మాట్లాడొచ్చు?

వాట్సాప్ గ్రూపు సృష్టించినట్టుగానే మెసెంజర్ రూమ్ క్రియేట్ చేసుకోవాలి. అలా మనం దాదాపు ఒకే సారి 50 మందితో వీడియో కాలింగ్ మాట్లాడుకునే అవకాశం ఉంది. ఈ వీడియో కాలింగ్ కోసం ఉద్యోగులను, స్నేహితులను, కుటుంబ సభ్యులను ఇన్‌వైట్ చేయొచ్చు. అంతేకాకుండా.. న్యూస్ ఫీడ్, గ్రూప్స్, ఈవెంట్ పేజీలలో లింక్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ వీడియో కాలింగ్ యాప్ అనేది.. ఉద్యోగులకు, ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించే స్కూళ్లకు బాగా ఉపయోగపడుతుందని వాట్సాప్ యాజమాన్యం పేర్కొంది.

Read More:

బ్రేకింగ్ న్యూస్: ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ కీలక ప్రసంగం

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. టెన్త్ విద్యార్థులకు వాట్సాప్‌ లెసన్స్

పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం