Health Alert: శరీరంలోని ఈ భాగాల్లో నొప్పి వస్తే వెంటనే అలర్టవ్వండి.. లేకపోతే పెనుప్రమాదమే బీకేర్‌ఫుల్..

ఆధునిక కాలంలో మనుషులను ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు ఇలా ఎన్నో విషయాలు పలు రోగాల బారినపడేలా చేస్తున్నాయి.

Health Alert: శరీరంలోని ఈ భాగాల్లో నొప్పి వస్తే వెంటనే అలర్టవ్వండి.. లేకపోతే పెనుప్రమాదమే బీకేర్‌ఫుల్..
Pain

Updated on: May 25, 2023 | 12:38 PM

ఆధునిక కాలంలో మనుషులను ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు ఇలా ఎన్నో విషయాలు పలు రోగాల బారినపడేలా చేస్తున్నాయి. శరీరంలో ఏదో ఒక భాగంలో నొప్పి రావడాన్ని మీరు తరచుగా చూసి ఉంటారు. ఈ నొప్పి సాధారణమైనదిగా.. ఒక్కొసారి తీవ్రంగా ఉంటుంది. కానీ నరాల వల్ల శరీరంలో ఆక్సిజన్ అందకపోవడం వల్ల చాలా కాలంగా మెడ నొప్పి వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ భాగాల గురించి తెలుసుకోవడం ముఖ్యం.. శరీరంలోని కొన్ని భాగాలలో నొప్పి తలెత్తితే అలర్ట్ అవ్వాలని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఎప్పుడు వైద్యులను సంప్రదించాలంటే..

  1. ఒక వ్యక్తి తన ఛాతీలో నొప్పిని అనుభవిస్తున్నట్లయితే అలర్ట్ అవ్వాలి. ఈ నొప్పి చాలా కాలంగా వస్తుంటే.. అది గుండెపోటు లక్షణాలలో ఒకటిగా పరిగణించాలి. రక్తం ద్వారా ఆక్సిజన్ గుండెకు చేరుకోనప్పుడు ఇది జరుగుతుంది. ఈ సందర్భంలో, వైద్యుడిని సంప్రదించవలసిన అవసరం ఉంది.
  2. ఒక వ్యక్తి కిడ్నీలో నొప్పిగా అనిపించినప్పుడు.. ఈ నొప్పి చాలా కాలంగా వస్తున్నట్లయితే.. ఇది కిడ్నీల్లో రాళ్ల సంకేతాలని అర్థం చేసుకోవచ్చు. కిడ్నీలో తేలికపాటి నొప్పి కూడా ఇదే సంకేతమని నిపుణులు పేర్కొంటున్నారు.
  3. ఇంకా కాళ్ళలో నొప్పిని అలాగే మీ చేతులు, కాళ్ళలో జలదరింపు, మీ బొటనవేలులో తిమ్మిరి మొదలైనవాటిని అనుభవిస్తున్నట్లయితే.. ఇది సయాటికా లక్షణాలలో ఒకటి కావచ్చు. వైద్యులను సంప్రదించడం మంచిది.
  4. మీరు కడుపులో నొప్పిని అనుభవిస్తున్నా.. దానితో పాటు వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలను చూస్తున్నట్లయితే, అది ప్యాంక్రియాటైటిస్ లక్షణాలలో ఒకటి కావచ్చు. ఈ సందర్భంలో వైద్యుడిని సంప్రదించవలసిన అవసరం ఉంది.
  5. తలనొప్పితో పాటు, అలసట, చిరాకు, నిరాశ మొదలైన లక్షణాలు కలిగి ఉంటే.. ఇది నాడీ వ్యవస్థలో ఆటంకాలు లేదా మైగ్రేన్ వల్ల వస్తాయని పేర్కొంటున్నారు. అలాంటి వారు తక్షణమే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..