ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే మెజారిటీ స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. దీన్ని బట్టే చూస్తుంటే జగన్ గెలుపు ఖాయమని అర్థమౌతోంది. అయితే గత ఎన్నికల్లో ఓడిన జగన్.. కొన్ని వ్యూహాలతో ఈ ఎన్నికల ప్రచారంలో అడుగులేసి.. గెలుపు దిశగా పయనిస్తున్నాడు. ముఖ్యంగా నవరత్నాల పేరుతో ఆయన తీసుకొచ్చిన పథకాలను ఓటర్లను అమితంగా ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో ఆయన గెలుపుకు నవరత్నాలు బాగా పనిచేశాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ గెలుపుకు ఒక మార్గంగా తన తండ్రి రూట్‌ను ఎంచుకున్న జగన్.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను చేశారు. అందులో ప్రజల సమస్యలను తెలుసుకున్న జగన్.. వాటి పరిష్కారానికి తగ్గట్లుగా మేనిఫెస్టోను రూపొందించారు. ఇవే జగన్‌ను విజయానికి దగ్గర చేశాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.