మాస్క్ లేకుండా బయటకొస్తే.. నేరుగా క్వారంటైన్‌కే..!

|

Jun 09, 2020 | 3:06 PM

పోలీసులు మాస్కులు లేకుండా రోడ్లపైకి వస్తున్నవారికి షాక్ ఇస్తున్నారు. మాస్క్ లేకుండా ఎవరు కనిపించినా వారిని నేరుగా క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఆదివారం నుంచి ఈ నిబంధన..

మాస్క్ లేకుండా బయటకొస్తే.. నేరుగా క్వారంటైన్‌కే..!
Follow us on

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోంది. అత్యవసర పనులకు తప్ప ఇంట్లో నుంచి ప్రజలెవ్వరూ కూడా బయటికి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. అటు రోడ్డుపైకి వస్తే ఖచ్చితంగా మాస్క్ ధరించాలని చెబుతున్నారు. ఈ క్రమంలోనే రూల్స్‌ను పట్టించుకోని వారిపై పోలీసులు కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు మాస్కులు లేకుండా రోడ్లపైకి వస్తున్నవారికి షాక్ ఇస్తున్నారు. మాస్క్ లేకుండా ఎవరు కనిపించినా వారిని నేరుగా క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఆదివారం నుంచి ఈ నిబంధన అమలులోకి రాగా.. పాలకొల్లు, తాడేపల్లిగూడెంలలో మాస్క్ ధరించకుండా బయటకొచ్చిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు పంపిస్తున్నారు. దీనికి పోలీస్ సిబ్బంది ప్రత్యేక వాహనాలను సిద్దం చేశారు. కాగా, ఈ రూల్‌ను ఏలూరు, భీమవరం, నరసాపురంలో కూడా అమలు చేయాలని వారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఎవరు బయటకి వచ్చినా కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Also Read: 

రేపటి నుంచి శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు జారీ…

జగన్ కీలక నిర్ణయం.. త్వరలోనే వైద్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.!

ఏపీ వెళ్ళాలనుకునేవారికి ముఖ్య గమనిక.. జగన్ సర్కార్ కీలక ప్రకటన..

నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

దసరా వరకు స్కూల్స్ తెరిచే ప్రసక్తి లేదు..!

యోగీ సర్కార్‌పై ప్రశంసలు.. ఇమ్రాన్‌పై సెటైర్లు.. పాక్ జర్నలిస్ట్ ట్వీట్ వైరల్..

కిమ్‌శకం ఇక ముగిసినట్లేనా.? ఆ ఇద్దరిలో ఒకరికి పగ్గాలు.!