పశ్చిమ బెంగాల్ లో 15 వేల మార్క్ కు చేరువైన కరోనా కేసులు

పశ్చిమ బెంగాల్ లో కొత్తగా 370 కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 14,728కి చేరింది.

పశ్చిమ బెంగాల్ లో 15 వేల మార్క్ కు చేరువైన కరోనా కేసులు

Updated on: Jun 23, 2020 | 9:11 PM

ఇప్పటి వరకు తక్కువ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న పశ్చిమ బెంగాల్ లో ఒక్కసారిగా పెరిగాయి. మంగళవారం ఒక్కరోజే కొత్తగా 370 కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 14,728కి చేరింది. కరోనా బారినపడి 11 మంది మరణించారు. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 580 మంది ప్రాణాలొదిలారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4,930 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. కరోనా జయించిన ఇవాళ డిశ్చార్జ్ అయిన 531 మందితో కలిపి 9,218మంది ఇళ్లకు చేరుకున్నట్లు బెంగాల్ ప్రభుత్వం తెలిపింది.

Loading...
Unable to load recommendations.
Follow Us