ఇండియాకు అత్యవసర సాయం చేస్తాం, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్

| Edited By: Anil kumar poka

Apr 26, 2021 | 8:11 AM

కోవిడ్ మహమ్మారితో సతమతమవుతున్న ఇండియాకు వెంటనే సహాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా  హారిస్ ప్రకటించారు. భారత దేశానికి, ప్రజలకు...

ఇండియాకు అత్యవసర సాయం చేస్తాం, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్
we will help you says us president joe biden to india
Follow us on

కోవిడ్ మహమ్మారితో సతమతమవుతున్న ఇండియాకు వెంటనే సహాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా  హారిస్ ప్రకటించారు. భారత దేశానికి, ప్రజలకు అన్ని రకాల సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బైడెన్ ట్వీట్ చేశారు. ప్రాణాధార మందులను, ఇతర వైద్య పరికరాలను మీ దేశానికి పంపుతామని ఆయన అన్నారు. పాండమిక్ తొలి సమయంలో తమ దేశంలోని ఆసుపత్రులు ఎలాంటి  పరిస్థితిని ఎదుర్కొన్నాయో, మీరు మాకు అప్పుడు ఎలా సాయం చేశారో తమకు గుర్తు ఉందని, ఇప్పుడు మీకు కూడా అలాగే హెల్ప్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇండియాలోని పరిణామాలను తాము గమనిస్తున్నామని డెలావర్ లో విశ్రాంతి తీసుకుంటున్న బైడెన్ అన్నారు. అటు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడిపదార్ధాలను వెంటనే పంపుతామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్..భారత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవల్ కు హామీ ఇచ్చ్చారు. ఫోన్ లో మాట్లాడిన ఆయన.. తమ దేశం నుంచి థెరాపెటిక్స్, రాపిడ్ డయాగ్నేస్టిక్ టెస్ట్ కిట్స్, వెంటిలేటర్స్, పీపీఈ కిట్స్ తదితరాలను ఇండియాకు పంపుతామని తెలిపారు.

అలాగే ఆక్సిజన్, ఇతర సంబంధిత సప్లయ్ లను కూడా పంపే అవకాశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఇండియాలో కేసులు సుమారు 27 లక్షలకు చేరుకున్నాయి. ఎప్పటికప్పుడు మీతో టచ్ లో ఉంటామని, మీకు ఏ సాయం కావాలన్నా అడగాలని జేక్ …అజిత్  దోవల్ కు హామీ ఇచ్చినట్టు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఇండియాలో రోజురోజుకు పెరుగుతున్న కేసుల పట్ల యూరోపియన్ యూనియన్, ఇజ్రాయెల్ వంటి దేశాలు కూడా స్పందించాయి. ఇండియాకు సాయం చేస్తామని హామీ ఇచ్చాయి.