ఆస్ట్రేలియా టూర్‌లో హిస్టరీ రిపీట్‌ చేస్తాం,టెస్ట్ సిరీస్‌ను గెల్చుకుని వస్తాం, పూజారా కాన్ఫిడెన్స్‌!

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించడం కష్టమే అయినా..! అదేమీ అసాధ్యం కాదని టీమిండియా ఇంతకు ముందు నిరూపించింది.. దూకుడుగా ఆడుతూ ఆసీస్‌ను బెంబేలెత్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి..

ఆస్ట్రేలియా టూర్‌లో హిస్టరీ రిపీట్‌ చేస్తాం,టెస్ట్ సిరీస్‌ను గెల్చుకుని వస్తాం, పూజారా కాన్ఫిడెన్స్‌!

Edited By:

Updated on: Nov 17, 2020 | 11:59 AM

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించడం కష్టమే అయినా..! అదేమీ అసాధ్యం కాదని టీమిండియా ఇంతకు ముందు నిరూపించింది.. దూకుడుగా ఆడుతూ ఆసీస్‌ను బెంబేలెత్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి.. ఇప్పుడు చతేశ్వర్‌ పూజారా కూడా ఆస్ట్రేలియా పర్యనటలో చరిత్ర పునావృతం అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు.. డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌లతో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉన్నప్పటికీ వారిని త్వరగానే పెవిలియన్‌కు పంపించడం టీమిండియా పేసర్లకు పెద్ద కష్టమైన పనేమీ కాదన్నాడు పూజారా. ఈ టూర్‌లో ఆస్ట్రేలియాను ఓడించి బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని సాధించడం ఖాయమన్నాడు. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడానికి భారత్‌కు 71 ఏళ్లు పట్టింది.. 2018-19 టూర్‌లో ఆస్ట్రేలియాను టెస్ట్‌ల్లో 2-1 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది.. భారత్‌ విజయంలో పూజారా పాత్ర ఎంతో ఉంది.. ఆ పర్యటనలో చతేశ్వర్‌ పూజార మూడు సెంచరీలతో 500లకు పైగా పరుగులు చేశాడు.. స్మిత్‌, వార్నర్‌ లేకపోయినా టీమిండియాకు ఆప్పటి విజయాలు అంత సులభంగా ఏమీ రాలేదన్నాడు.. తమ బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉందన్నారు.. ఆసీస్‌ బౌలర్లను ఎదుర్కొని మంచి స్కోరును సాధించగలమని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు పూజారా..