కామంతో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గులు దారుణాలకు యత్నిస్తున్నారు. వ్యక్తుల పరిస్థితి ఉన్న పరిసరాలను మరిచి అమాయకులపై అఘాయిత్యానికి ఒడిగడుతున్నారు. ఆసుపత్రిలో కరోనా రోగిపై కూడా వాచ్‌మెన్ అత్యాచారం జరపిన ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సంచలనం రేపింది. కాపాలా ఉండాల్సిన వారే కాలాంతకులుగా మారుతున్నారు. తాజాగా ముంబై నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా మహిళా రోగిపై లైంగికదాడికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సాక్షాత్తూ వాచ్‌మెన్ అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగుచూసింది. ఓ మహిళ కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముంబై నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఈ నెల 5వ తేదీన రాత్రి ఆసుపత్రి వాచ్ మెన్ కరోనా మహిళా రోగి ఉన్న వార్డులోకి ప్రవేశించాడు. గదిలో ఉన్న ఆమెపై అత్యాచారం చేశాడు. ఆసుపత్రిలోని తోటి రోగులు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాధిత కరోనా రోగి ఫిర్యాదుతో ఆసుపత్రి వాచ్ మెన్ పై కేసు నమోదు చేశారు. నిందితుడైన వాచ్ మెన్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామని కురార్ పోలీసు అధికారి తెలిపారు. దీనిపై నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసులు చెప్పారు.