రౌడీ షీటర్.. పది హత్యకేసులలో నిందితుడు, అలాంటి వ్యక్తికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శా..! గులాబీనేతల స్ట్రాంగ్ కౌంటర్

|

Jan 02, 2021 | 10:04 PM

19 కేసుల్లో నిందితుడు జైలు పాలైతే అలాంటి నాయకున్ని పరామర్శించడం కోసం వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తన స్థాయి దిగజారిపోయేలా ప్రవర్తించారని వరంగల్ కు చెందిన..

రౌడీ షీటర్.. పది హత్యకేసులలో నిందితుడు, అలాంటి వ్యక్తికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శా..! గులాబీనేతల స్ట్రాంగ్ కౌంటర్
Follow us on

19 కేసుల్లో నిందితుడు జైలు పాలైతే అలాంటి నాయకున్ని పరామర్శించడం కోసం వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తన స్థాయి దిగజారిపోయేలా ప్రవర్తించారని వరంగల్ కు చెందిన అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఒక రౌడీ షీటర్, గూండా, హంతకుడు జైలు పాలైతే అలాంటివారిని టీపీసీసీ చీఫ్ సమర్ధించడం సిగ్గుచేటన్నారు. వరంగల్ సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని పరామర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో వరంగల్ కు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉత్తమ్ కు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు.. జైలుపాలైన జంగా రాఘవరెడ్డి ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న నేరస్తుడని ఆరోపించారు. జంగా ఒక రౌడీ.. పది హత్యకేసులలో నిందితుడని ఆరోపించారు. రౌడీషీటర్ గా ముద్రపడి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నగర బహిష్కరణకు గురైన నేరస్థుడిని సమర్ధించడం సిగ్గుచేటని విమర్శించారు.