హీటెక్కిన దుబ్బాక దంగల్.. “సై అంటే సై”
దుబ్బాకలో బీజేపీ నాయకుల గోబెల్స్ ప్రచారానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు మంత్రి హరీష్‌రావు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా ఉందన్న ప్రచారాల్లో నిజం లేదన్నారాయన.మరోవైపు తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై..ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్!
దుబ్బాకలో బీజేపీ నేతలు ఇలా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్! కేసీఆర్ కిట్‌కు అయ్యే ఖర్చులో 8 వేలు మోదీ ఇస్తున్నారని..బీడీ కార్మికులకు ఇస్తున్న రెండు వేలలో 1600 మోదీయే ఇస్తున్నారంటూ.. బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఎనీ సెంటర్.. ఎనీ టైమ్ డిబేట్‌కు రెడీ అంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు హరీష్‌రావు సవాల్ విసిరారు. “దుబ్బాకలో బస్తీ మే సవాల్! పాత బస్టాండ్ దగ్గరకు రా..! కేంద్రం ఏం ఇస్తోందో..రాష్ట్రం ఏం ఇస్తోందో..తేల్చుకుందాం” అంటూ మంత్రి హరీష్‌రావు సవాల్ విసిరారు.
హుజూర్‌నగర్‌లో కూడా ఇలాగే గోబెల్స్ ప్రచారం చేశారని..అక్కడ బీజేపీ నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు హరీష్‌రావు! తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టి.. నాల్గోప్లేస్‌కు పరిమితం చేసినా..బీజేపీ నేతలకు బుద్ధి రాలేదని సెటైర్ విసిరారు. బైట్-హరీష్‌రావు, తెలంగాణ ఆర్థికమంత్రి .
వివిధ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కేంద్రమే ఇస్తున్నట్లు చెప్పుకోవడం విడ్డూరమన్నారు మంత్రి హరీష్‌రావు! ముందు రాష్ట్రానికి…న్యాయబద్ధంగా రావాల్సిన నిధుల విడుదలకు బీజేపీ నేతలు కృషి చేయాలన్నారు. అయితే మంత్రి హరీష్ వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కేంద్రం తెలంగాణకు 50 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారాయన! కేంద్రం ఇచ్చిన నిధులపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు రాజాసింగ్. మొత్తంమ్మీద టీఆర్‌ఎస్-బీజేపీ నేతల మాటల యుద్ధం నేపథ్యంలో దుబ్బాక దంగల్ మరింత హీటెక్కింది.