హిందీలో ‘సైరా’కు ‘వార్’ తప్పదా..!

| Edited By: Pardhasaradhi Peri

Oct 04, 2019 | 12:02 PM

గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ‘వార్’. దాదాపు 300 కోట్లతో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇద్దరూ యాక్షన్ హీరోస్.. పైగా బడా నిర్మాణ సంస్థ.. ఇంకా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్.. అన్నింటికీ మించి అత్యద్భుతమైన యాక్షన్ కథ.. ఇది చాలు ‘వార్ ‘ వైపు ఫ్యాన్స్‌ చూపు తిప్పడానికి.. అంతేకాక ఈ సినిమా టీజర్, […]

హిందీలో సైరాకు వార్ తప్పదా..!
Follow us on

గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ‘వార్’. దాదాపు 300 కోట్లతో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇద్దరూ యాక్షన్ హీరోస్.. పైగా బడా నిర్మాణ సంస్థ.. ఇంకా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్.. అన్నింటికీ మించి అత్యద్భుతమైన యాక్షన్ కథ.. ఇది చాలు ‘వార్ ‘ వైపు ఫ్యాన్స్‌ చూపు తిప్పడానికి.. అంతేకాక ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచేశాయి. దీంతో హిందీలో మెగాస్టార్ ‘సైరా’కు బాక్స్ ఆఫీస్ దగ్గర ‘వార్’ డిక్లేర్ అయింది. ‘బాహుబలి’ స్థాయిలో ‘సైరా’ రెండు ట్రైలర్లు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్‌తో సహా ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో ఉండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. ‘బాహుబలి’ సినిమాను ఉత్తరాది ఫ్యాన్స్ ఎంతలా ఆదరించారో అందరికి తెలిసిందే. అందుకే ‘సాహో’ సినిమాకు బ్యాడ్ రివ్యూస్ వచ్చినా.. అద్భుతమైన కలెక్షన్స్ వచ్చి పడ్డాయి. సరిగ్గా ‘సైరా’ కూడా ‘బాహుబలి’ మాదిరిగానే ఉండటం.. పైగా కావాల్సినంత యాక్షన్, దేశభక్తి, హీరో ఎలివేషన్ సీన్స్, గూస్ ‌బంప్స్ వచ్చేలా సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఇలాంటి వాటి కోసం హిందీ ప్రేక్షకులు ముఖం వాచిపోయి ఉన్నారు.

దీంతో ‘సైరా’ అడ్వాన్స్ బుకింగ్స్ నార్త్ సైడ్ అద్భుతంగా ఉన్నాయి. అయితే అటు ‘వార్’ సినిమాకు కూడా పాజిటివ్ టాక్ రావడంతో.. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు హోరాహోరీగా సాగేలా ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. హృతిక్ రోషన్ సినిమా వస్తే చాలు.. టాక్‌తో పని లేకుండా ఫ్యాన్స్ విపరీతంగా థియేటర్ల దగ్గర క్యూ కడతారు. అటు దక్షిణాదిలో అతడికి అభిమానులకు కొదవ లేదు.

కానీ దక్షిణాదిన మాత్రం ‘సైరా’ హావా నడుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల్లో కూడా ‘సైరా’కు రెస్పాన్స్ అమోఘం. తెలుగులో అయితే చిరంజీవి చరిష్మా ముందు ‘వార్’ ఖచ్చితంగా తేలిపోతుంది. మిగిలిన భాషల్లో అయితే మాత్రం హోరాహోరీ పోరు తప్పదు. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర ఏ చిత్రానికి భారీ వసూళ్లు వస్తాయో వేచి చూడాలి.